ధోని ఐపిఎల్ రిటైర్మెంట్ పై.. రోహిత్ ఏమన్నాడో తెలుసా?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్లో ఏ కెప్టెన్ కి సాధ్యం కాని రీతిలో ఏకంగా మూడుసార్లు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్గా కొనసాగుతున్నడు మహేంద్రసింగ్ ధోని. ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కేవలం ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మాత్రమే కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చెన్నై జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ అందించాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఈ ఏడాది కూడా ధోని కెప్టెన్సీ లోనే బరిలోకి దిగబోతున్న చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ కొట్టడమే లక్ష్యంగా ఐపీఎల్ లో అడుగు పెట్టబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇక ఐపీఎల్ ప్రారంభం నుంచి కూడా ధోని అభిమానులు అందరినీ కూడా ఆందోళనకు గురి చేసే ఒక వార్త వైరల్ గా మారిపోయింది. అదే ధోని ఐపిఎల్ రిటైర్మెంట్ గురించి. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని ఇక ఈ సీజన్ ముగిసిన తర్వాత ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఇక క్రికెట్కు దూరంగా ఉంటాడని అన్న వార్తలు వస్తున్నాయి.

 ఇక ఇలాంటి వార్తలు గురించి ఇప్పుడు వరకు ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారూ. ఇక ఇదే విషయంపై ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ సైతం స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అని చెప్పాలి. గత రెండు మూడు సంవత్సరాలుగా మహేంద్రసింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ వార్తలు వింటున్నాను. కానీ అతను మరో రెండు మూడు సీజన్లలో ఆడటానికి ఫిట్ గా ఉన్నాడని నేను భావిస్తున్నాను అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసుకురావడం ఎంతో మంచిదని దీన్ని ప్రతి జట్టు ఉపయోగించుకుంటుంది అంటూ చెప్పుకుంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: