ఐపీఎల్ 2023 : బద్దలయ్యేందుకు సిద్ధంగా ఉన్నా రికార్డులివే?

praveen
2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చ్ 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాష్ రిచ్ లీగ్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అన్ని జట్ల ఆటగాళ్లు కూడా ప్రస్తుతం క్యాంపులో చేరి ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఈసారి ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక ఈ ఏడాది ఐపిఎల్ లో కొన్ని రికార్డులు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది.

 అత్యధిక వికెట్లు : ఇప్పుడు వరకు ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా  బ్రావో కొనసాగుతున్నాడు. ఇప్పుడు 183 వికెట్లు తీశాడు. అయితే చాహల్ 166 వికెట్లతో ఉండగా.. అతను 18 వికెట్లు తీస్తే బ్రావో రికార్డు బ్రేక్ అవుతుంది.

 అత్యధిక సెంచరీలు  : ఐపీఎల్ అత్యధిక సెంచరీల రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. అతను ఐపిఎల్ లో ఆరు సెంచరీలు చేశారు. అయితే జోష్ బట్లర్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్ ఈ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది.

 అత్యధిక సిక్సర్లు  : ఎబి డివిలియర్స్ 250 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా ఉండగా.. రోహిత్ 240 సిక్సర్ల వద్ద ఉన్నాడు.  దీంతో ఈ రికార్డును రోహిత్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ లిస్టులో క్రిస్ గేల్ 357 సిక్సర్లతో టాప్ లో ఉన్నాడు.

 అత్యధిక డక్స్  : రోహిత్ శర్మ మరో మ్యాచ్ లో డక్ అవుట్ అయితే మన్దీప్ సింగ్ (14) ను అధికమించి హోల్ అండ్ సోల్ గా చెత్త రికార్డు సృష్టిస్తాడు.
 అత్యధిక మ్యాచ్లు : ధోని ప్రస్తుతం 234 మ్యాచ్లతో ఎక్కువ మ్యాచ్ ఆడిన ప్రేయర్ గా ఉన్నాడు. ఇక ఈ సీజన్ లో అన్ని మ్యాచ్లకి అందుబాటులో ఉంటే 250 మ్యాచ్ లు ఆడిన ప్రేయర్ గా మారతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: