నేను సెలెక్టర్ అయితే.. అతన్నే చూసుకునేవాడిని : దావన్

praveen
ఇటీవల కాలం లో భారత క్రికెట్లో యువ ఆటగాడు శుభమాన్ గిల్ అద్భుతమైన ఆట తీరు తో ఆకట్టుకుంటున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారీస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఓపెనర్ గా బరి లోకి దిగుతూ టీమిండియా కు మంచి ఆరంభాలు అందిస్తున్నాడూ శుభమాన్ గిల్. అయితే మూడు ఫార్మాట్లలో కూడా ఈ యువ ఆటగాడు మంచి ప్రదర్శన చేస్తున్న నేపథ్యం లో కొంత మంది సీనియర్ ఆటగాళ్ల కెరియర్ ప్రమాదం లో పడి పోయింది అని చెప్పాలి.

 ఈ క్రమం లోనే ఒకప్పుడు భారత జట్టు లో కీలకమైన ఆటగాడిగా పర్మినెంట్ ఓపెనర్ గా ఉన్న శిఖర్ ధావన్ కెరియర్ కూడా శుభమాన్ గిల్ కారణంగా ప్రమాదం లో పడి పోయింది. మొదట టి20 లకు దూరమైన శిఖర్ ధావన్ కేవలం వన్డేలకు మాత్రమే పరిమితం అయ్యాడు. అయితే వన్డే ఫార్మాట్లో ఇక సెంచరీలు డబుల్ సెంచరీలు చేస్తూ ఉండడంతో ఇక ఓపెనర్గా శిఖర్ ధావన్ కి ఛాన్స్ లేకుండా పోయింది అని చెప్పాలి. దీంతో గత కొంతకాలం నుంచి శిఖర్ ధావన్ భారత జట్టులో కనిపించడం లేదు.

 ఇకపోతే ఇలా శుభమాన్ గిల్ ఏకంగా తన స్థానాన్ని భర్తీ చేస్తూ ఉండడం గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తాడు శిఖర్ ధావన్. యంగ్ ప్లేయర్ శుభమాన్ గిల్ అన్ని ఫార్మాట్లలో కూడా రాణిస్తున్నాడు అంటూ శేఖర్ ధావన్ పేర్కొన్నాడు. అతన్ని వన్డేల్లోకి తీసుకొని సెలెక్టర్లు మంచి పని చేశారు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ తాను సెలెక్టర్ గా ఉన్నా కూడా నేను కూడా అతన్నే సెలెక్ట్ చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు శిఖర్ ధావన్. కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్  తనకు అండగా నిలిచారు.  2023 వన్డే వరల్డ్ కప్ పై దృష్టి పెట్టాలని సూచించారు అని చెప్పుకు వచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: