స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంటుందట.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న కోహ్లీ?
ఇక గత ఎడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలం సమయం లో కొంత మంది ఆటగాళ్లను వదిలేసుకున్న జట్లు మరి కొంత మంది ఆటగాళ్లని జట్టు లోకి తీసుకున్నాయ్ అని చెప్పాలి. ఈ క్రమం లోనే కొన్ని జట్లు మరింత పటిష్టం గా మారి పోయాయ్. ఇక అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఇలాగే పటిష్టంగా మారి పోయింది అని చెప్పాలి. ఈ క్రమం లోనే ఇక ఈసారి తప్పకుండా కప్పు గెలుస్తుందని ఎప్పటి లాగానే అభిమానులు అందరూ కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు.
ఇక కోహ్లీ ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనేదానిపై కూడా చర్చ జరుగుతుంది. ఇక ఈ విషయం పై విరాట్ కోహ్లీ స్పందించాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మునుపటి ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఐపీఎల్ లో అదరగొడతాను అంటూ చెప్పుకొచ్చాడు. పాత కోహ్లీని చూస్తారని... ఈ ఐపీఎల్లో అది తప్పకుండా జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆట నుంచి బ్రేక్ తీసుకోవడం తనకు ఎంతగానో కలిసి వచ్చిందని.. చిన్నస్వామి స్టేడియంలో చాలా రోజుల తర్వాత ఆడుతుండడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అంటూ తెలిపాడూ. ఆర్సిబి ఆన్ బాక్స్ ఈవెంట్ లో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా చేస్తాను అంటూ అభిమానుల్లో ఆతృత పెంచేశాడు కోహ్లీ.