రోహిత్ క్లాసిక్ లుక్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్?

praveen
సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇక జట్టుకు కెప్టెన్ గా ఉన్న ఆటగాడికి సంబంధించిన విషయం అయితే ఇక సోషల్ మీడియాను ఊపేయడం ఖాయమని చెప్పాలి. అయితే మైదానంలో ఎప్పుడు టీమిండియా జెర్సీలో కనిపించే ఆటగాళ్లు అటు బయట మాత్రం ఎంతో స్టైలిష్ లోకి కనిపిస్తూ సినిమా హీరోల్లాగే కనిపిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలాంటి ఫోటో ఏదైనా ఇంటర్నెట్ లోకి వస్తే అది అభిమానుల దృష్టిని తెగ ఆకర్షిస్తూ ఉంటుంది.

 అంతేకాదు ఇక క్రికెటర్ల ఫ్యామిలీ విషయాలను తెలుసుకోవడానికి అటు అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారూ అనే విషయం తెలిసిందే. అయితే ఇక ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టును మరోసారి ఛాంపియన్గా నిలిపేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాడు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక కాస్త గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో చిల్ అవుతున్నాడు. ఇటీవల రోహిత్ భార్య రితిక తమ్ముడు పెళ్లి వేడుకలో క్లాసిక్ లుక్ లో కనిపించాడు రోహిత్ శర్మ. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ గా మారిపోయాయ్.

 ఎప్పుడు టీమిండియా జెర్సీలో కనిపించే రోహిత్ శర్మను ఇక ఇలా ట్రెడిషనల్ డ్రెస్ లో ఎంతో క్లాసిక్ లుక్ లో చూసి అటు అభిమానులు అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు అని చెప్పాలి. అచ్చం సినిమా హీరో లాగే ఉన్నావు అంటూ ఎంతో మంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ట్రెడిషనల్ డ్రెస్ లో హిట్ మాన్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇక ఇలా రోహిత్ ట్రెడిషనల్ లుక్ లో క్లాసిక్ గా కనిపించడం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: