వైరల్ : ధోనీని మరిపించేలా.. బాలిక హెలికాప్టర్ షాట్?

praveen
ప్రపంచ క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కొట్టే హెలికాప్టర్ షాట్ లకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు కనీసం డిఫెండ్ చేయడమే కష్టం అనుకున్న యార్కర్ బంతులను తనదైన శైలిలో మెరుపు వేగంతో హెలికాప్టర్ షాట్ ఆడి సిక్సర్ గా మలుస్తూ ఉంటాడు మహేంద్రసింగ్ ధోని. అందుకే ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా ధోని హెలికాప్టర్ షాట్ ఎంతగానో ఫేమస్ అయింది. ఇక అచ్చం ధోని లాగానే ఎంతోమంది క్రికెటర్లు హెలికాఫ్టర్ షాట్ ఆడటానికి ప్రయత్నించి విఫలమైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే ధోని శిష్యుడుగా పేరున్న హార్దిక్ పాండ్యా అప్పుడప్పుడు ధోని తరహాలోనే హెలికాప్టర్ షాట్ ఆడుతూ అదరగొడుతూ ఉంటాడు. ఇక ఇలాంటి షార్ట్షాట్ ఎవరైనా ఎప్పుడైనా ఆడారు అంటే చాలు అది చూసి ధోని అభిమానులు అందరూ కూడా మురిసిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఏ ఆటగాడు ఆడిన ఎందుకో ధోని లాగా హెలికాప్టర్ షాట్ కనిపించడం లేదని కామెంట్ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక బాలిక మాత్రం ఏకంగా ధోని అభిమానులనే హెలికాప్టర్ షాట్ తో ఫిదా చేసేస్తూ ఉంది. అచ్చం ధోని హెలికాప్టర్ షాట్ కొట్టాడేమో అనేంతలో పర్ఫెక్ట్ గా షాట్ ఆడుతుంది ఇక్కడ ఒక బాలిక. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఈ వీడియోను స్వయంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో చూసుకుంటే సదరు బాలిక ఫుల్ షాట్లతోపాటు కవర్ డ్రైవ్ లు కూడా ఎంతో అద్భుతంగా ఆడటం చూడవచ్చు. అదే సమయంలో ఇక ధోని తరహాలోనే అద్భుతమైన హెలికాప్టర్ షాట్లు ఆడటం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది అని చెప్పాలి. అయితే ఈ వీడియో పోస్ట్ చేసిన రైల్వే మంత్రిని కూడా ఆ బాలిక ఆడిన హెలికాప్టర్ షాట్ బాగా ఆకట్టుకుంది అని చెప్పాలి. ఈ బాలిక ఆడిన షాట్లలో నాకు ఫేవరెట్ హెలికాప్టర్ షాట్.. మరి మీకు ఏ షాట్ ఫేవరెట్ అంటూ మంత్రి నేటిజన్స్  కి ఒక ప్రశ్న వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: