WPL 2023 :డైరెక్ట్ గా ఫైనల్ కు దూసుకెళ్లిన ఢిల్లీ... ముంబై ఇండియన్స్ కు నిరాశ !

frame WPL 2023 :డైరెక్ట్ గా ఫైనల్ కు దూసుకెళ్లిన ఢిల్లీ... ముంబై ఇండియన్స్ కు నిరాశ !

VAMSI
గత మూడు వారాలుగా నిర్విరామంగా జరుగుతున్న మహిళా ప్రీమియర్ లీగ్ సీజన్ 1 ఎంతో ఆసక్తికర మలుపులతో లీగ్ దశను ముగించింది. ఈ లీగ్ ను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా క్రికెట్ లో అసలైన మజాను రుచి చూశారనే చెప్పాలి. మొత్తం అయిదు జట్లతో (ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ , బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ మరియు గుజరాత్ జెయింట్స్ ) ఈ లీగ్ ను స్టార్ట్ చేసిన బీసీసీఐ చాలా హ్యాపీగా ఉంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. లీగ్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ క్యాపిటల్స్ , ముంబై ఇండియన్స్ మరియు యూపీ వారియర్స్ జట్లు ప్లే ఆఫ్ కు అర్హత సాధించి టైటిల్ కు మరో అడుగు దూరంలో నిలిచాయి.
సీజన్ లో మొదటి నుండి ఎంతో అద్భుతంగా ఆడుతూ వచ్చిన ముంబై ఇండియన్స్ వరుసగా అయిదు మ్యాచ్ లలో గెలిచి టేబుల్ టాపర్ గా నిలిచింది. కానీ ఆరు మరియు ఏడవ మ్యాచ్ లలో ఓటమి పాలయ్యి టేబుల్ లో రెండవ స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత లాస్ట్ లీగ్ మ్యాచ్ లో గెలిచినా తన కన్నా మెరుగైన రన్ రేట్ ను కలిగి ఉన్న ఢిల్లీ మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంది. దానితో ముంబై ఇండియన్స్ కు నిరాశే మిగిలింది. ఈ లీగ్ రూల్స్ ప్రకారం లీగ్ స్టేజ్ లో మొదటి మూడు స్థానాలను ఆక్రమించుకున్న జట్లు ప్లే ఆఫ్ కు చేరుకుంటాయి. అందులో మొదటి స్థానంలో ఉన్న జట్టు డైరెక్ట్ గా ఫైనల్ కు చేరుకుంటుంది.
ఆ తర్వాత రెండు మూడు స్థానాలలో ఉన్న జట్లు ప్లే ఆఫ్ లో ఆడి గెలిచిన జట్టు ఫైనల్ లో ఉన్న జట్టుతో ఆడి టైటిల్ కోసం పోరాడాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఇప్పుడు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన ఢిల్లీ డైరెక్ట్ గా ఫైనల్ చేరింది. ఈ శుక్రవారం జరగనున్న ఎలిమినేటర్ లో ముంబై ఇండియన్స్ అప్ వారియర్స్ ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ లో విజేత ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో టైటిల్ సమరంలో పోటీ పడనుంది. మరి చూద్దాం ముంబై టైటిల్ కొడుతుందా లేదా ఢిల్లీ లేదా యూపీ వారియర్స్ లో టైటిల్ కొడతారా అన్నది చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: