పూజార వరస్ట్.. నమ్ముకుంటే అంతే పరిస్థితి : కోహ్లీ

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ఎబి డివిలియర్స్ ఎంత మంచి స్నేహితులో అన్న విషయం దాదాపు అందరికీ తెలుసు. ఈ ఇద్దరు కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఎన్నో ఏళ్ల పాటు కలిసి ఆడారు. అదే సమయంలో వీరి మధ్య ఇక మంచి స్నేహబంధం కూడా ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏ బి డివిలియర్స్ ఐపీఎల్ నుంచి తప్పుకున్న సమయంలో కోహ్లీ ఎమోషనల్ అవడం కూడా చూశాం. ఇకపోతే ప్రస్తుతం ఏపీ డిబిలియర్స్ నిర్వహిస్తున్న మిస్టర్ 360 షో కి అటు విరాట్ కోహ్లీ గెస్ట్ గా వెళ్లాడు.

 కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఏపీ డివిలియర్స్ అతన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగి ఎన్నో ఆసక్తికర సమాధానాలను కూడా రాబట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వికెట్ల మధ్య బెస్ట్, వరస్ట్ రన్నర్ ఎవరు అని అనుకుంటున్నావు అంటూ ఏబి డివిలియర్స్ అడిగిన ప్రశ్నకు అటు కోహ్లీ ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. తనకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనితో టెంపో బాగా ఉన్నప్పటికీ ఇక వికెట్ల మధ్య పరుగులు పెట్టడం విషయంలో మాత్రం ఎబి డివిలియర్స్ కి ఎవరు సాటిరారు అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. కొన్ని కొన్ని సార్లు అతనితో పరిగెత్తాలంటే నాకే భయమేస్తుంది అంటూ చెప్పాడు.

 ఇక వరస్ట్ రన్నర్ ఎవరు అని అడిగితే.. టీమ్ ఇండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చాటేశ్వర పూజార అంటూ కోహ్లీ సమాధానం ఇచ్చాడు. అతన్ని నమ్మి వికెట్ల మధ్య పరిగెత్తాలంటే భయమేస్తూ ఉంటుంది. అతనికి ఓపిక ఎంతో ఎక్కువ. క్విక్ సింగల్ తీయాల్సిన అవసరం ఏముందని అనుకుంటూ ఉంటాడు. ఇక పూజారతో బ్యాటింగ్ చేస్తే అతను పిలిచేదాక నాన్స్ట్రైకింగ్ లో నిద్రపోవచ్చు. కూడా అంత టైం ఉంటుంది అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక దీనికి ఒక ఉదాహరణ కూడా తెలిపాడు. 2018 లో దక్షిణాఫ్రికా తో టెస్ట్ ఇన్నింగ్స్ సమయంలో నేను అవుట్ అయిన కాసేపటికి పూజార రన్ అవుట్ అయ్యాడు. ఇలాగే రెండు ఇన్నింగ్స్ లో కూడా  పరుగులు తీస్తూ రన్ అవుట్ అయ్యాడు. దీంతో డగ్ అవుట్ లోకి వచ్చిన పూజారకు చివాట్లు పెట్టాను అంటూ గుర్తు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: