గుజరాత్ జట్టుకు షాక్.. కెప్టెన్ కు గాయం.. లీగ్ మొత్తానికి దూరం?
ప్రతి జట్టు కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా హోరాహోరీగా పోరాటం సాగిస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ప్రేక్షకులు అందరూ కూడా మ్యాచులను వీక్షిస్తూ అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ను పొందుతూ ఉన్నారు. ఇలా ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో కొన్ని జట్లకు మాత్రం ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే జట్టులో ఉన్న కీలక ప్లేయర్లు దూరం అవుతూ ఉండడం జరుగుతూ ఉంది. దీంతో ఇక తమ అభిమాన జట్లు కీలక ప్లేయర్లు లేకుండా బలహీనంగా మారిపోతూ ఉండటం చూసి నిరాశలో మునిగిపోతున్నారు ఫ్యాన్స్.
అయితే గత ఏడాది ఐపిఎల్ లో మొదటిసారి ఐపీఎల్లోకి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టు హార్దిక్ సారధ్యంలో మొదటి ప్రయత్నంలోనే టైటిల్ గెలిచింది. ఇక ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా గుజరాత్ జట్టు ఐపీఎల్ మాదిరిగానే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా మొదటి ప్రయత్నంలోనే కప్పు గెలుస్తుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గుజరాత్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న బెత్ మూవీ గాయం బారిన పడి టోర్నీ మొత్తానికి దూరమైంది. దీంతో ఆమె స్థానంలో సస్నేహ్ రాణాను కెప్టెన్ గా ప్రకటించింది గుజరాత్ యాజమాన్యం. ఆల్ రౌండర్ యాష్లే గార్నర్ ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. బెత్ మూవీ ప్లేస్ లో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ లారా వాల్ వర్డును జట్టులోకి తీసుకుంది.