ఫైనల్ మ్యాచ్ అంటే ఇలా ఉండాలి.. చివరి ఓవర్లోనే 5 వికెట్లు?
సాదాసీదా మ్యాచ్ అయితే పర్వాలేదు. కానీ ఒకవేళ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు ప్రేక్షకులు. ఇక మ్యాచ్లో ఉత్కంఠ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అయితే ఇలా రసవత్తరంగా సాగిన మ్యాచులు క్రికెట్ ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి మ్యాచ్ ఒకటి జరిగింది. ఆస్ట్రేలియాలోని ఒక దేశవాళీ లీగ్ లో రసవతరంగా సాగిన మ్యాచ్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆస్ట్రేలియా, టస్మానియా జట్లు తలబడ్డాయి.
ఈ మ్యాచ్ ఎలా సాగిందో తెలిస్తే మాత్రం ఇంతకంటే ఉత్కంఠ భరితమైన మ్యాచ్ గురించి మీరు ఇప్పటివరకు విని ఉండరు అని అనిపిస్తూ ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసిన టస్మానియా 50 ఓవర్లలో 264 పరుగులు చేసింది. ఆ తర్వాత సౌత్ ఆస్ట్రేలియా 44 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. తర్వాత వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. ఇక డాక్ వర్త్ లూయిస్ ప్రకారం సౌత్ ఆస్ట్రేలియా 47 ఓవర్లో 243 కు పరుగులను సవరించారు. 46వ ఓవర్లో వరకు 239 పరుగులు చేసింది సౌత్ ఆస్ట్రేలియా. ఆరు బంతుల్లో నాలుగు పరుగులు కావలసిన సమయంలో మ్యాచ్ మరింత ఉత్కంఠ భరితంగా సాగింది. ఎందుకంటే చివరి ఓవర్ లో ఐదు వికెట్లు టపా టపామని పడిపోయాయి. దీంతో నరాలు తెగ ఉత్కంఠ మధ్య సాగిన చివరి ఓవర్లో నాలుగు పరుగులు చేయలేకపోయినా సౌత్ ఆస్ట్రేలియా ఒక పరుగు తేడాతో ఓడిపోయింది.