RCB జట్టుకు.. కొత్త కెప్టెన్.. ఎవరో తెలుసా?
అయితే ఈ జట్టుకు ఈ రేంజ్ లో మంచి క్రేజ్ రావడానికి కారణం అటు టీమిండియా కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ సారథ్యం వహించడమే అని చెప్పాలి. అంతేకాదు ఈ జట్టులో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు కూడా ఉండడం ఒక కారణమే. ఇక ఆర్సిబి ఒక్కసారి టైటిల్ కూడా గెలవకపోయినప్పటికీ పాపులరిటి విషయంలో మాత్రం అందరికంటే టాప్ లోనే ఉంది. అయితే ఇక ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనసాగుతోంది. ఇక ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కు సంబంధించి జరిగిన వేలంలో కూడా ఎంతోమంది ప్లేయర్లను జట్టులోకి తీసుకుంది అన్న విషయం తెలిసిందే.
కాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మొదటి సీజన్లో కెప్టెన్సీ వహించే అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారు అన్నది హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే ప్రస్తుతం భారత ఉమెన్స్ టీమ్ లో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న స్మృతి మందన బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా ఎంపికైంది. ఆర్సిబి చైర్మన్ ప్రతిమెష్ మీశ్రా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టును స్మృతి మందాన ముందుండి నడిపించబోతుంది అన్నది తెలుస్తుంది. కాగా ఐపీఎల్ లో మెన్స్ ఆర్సిబి టీం కి కెప్టెన్ గా డూప్లెసెస్ వ్యవహరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.