ఢిల్లీ టెస్ట్ లో ఇండియాను ఓడించేందుకు ఆస్ట్రేలియా భారీ ప్లాన్ !
రేపు ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం లో రెండవ టెస్ట్ ప్రారంభం కానుంది. సిరీస్ లో ఆస్ట్రేలియా గట్టి పోటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అని చెప్పాలి. అందుకే ఆస్ట్రేలియా టీం కోచ్ మరియు కెప్టెన్ లు ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలన్న కసితో వ్యూహాలతో నిమగ్నం అయ్యారు. గత మ్యాచ్ లో ఫెయిల్ అయినా ఆటగాళ్లపై వేటు పడేలా ఉంది. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ మాట్ రెన్సా రెండు ఇన్నింగ్స్ లలోనూ ఘోరంగా విఫలం అయ్యాడు. అందుకే ఇతనిని బెంచ్ కే పరిమితం చేసి హెడ్ ను జట్టులోకి తీసుకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
ఇక స్టార్క్ , హాజిలీవూడ్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే ఛాన్సెస్ ఉంది. ఇక ఈ మధ్యన ముగిసిన బిగ్ బాష్ లీగ్ లో అద్బుతమగా రాణించిన స్పిన్నర్ కూనేమాన్ కు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక ఆస్ట్రేలియాను టెస్ట్ లలో ప్రపంచ నెంబర్ వన్ జట్టుగా నిలపడంలో కీలకంగా మారిన స్టీవెన్ స్మిత్, మార్నష్ లబుచెన్ , వార్నర్ , ఖవాజా లు రాణిస్తే ఖచ్చితంగా ఈ టెస్ట్ ను మాత్రమే కాదు.. సిరీస్ ను కూడా గెలుచుకోవచ్చు. ఇక గత మ్యాచ్ లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన స్పిన్నర్ టాడ్ మర్ఫీ మరోసారి రాణిస్తే గెలుపు ఈజీనే..మరి ఏమి జరుగుతుంది అన్నది చూడాలి.