అశ్వినే కాదు.. షమీ కూడా అరుదైన రికార్డ్?
ఆస్ట్రేలియా జట్టును ఏకంగా 177 పరుగులకే ఆల్ అవుట్ చేసి సత్తా చాటింది టీమిండియా బౌలింగ్ విభాగం. ఒకవైపు ఫాస్ట్ బౌలర్లు బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తే.. మరోవైపు స్పిన్ బౌలర్లు తమ మాయాజాలంతో ప్రత్యర్థి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను బోల్తా కొట్టించి వికెట్లు దక్కించుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రవిచంద్రన్ అశ్విన్ అత్యంత వేగంగా 450 వికెట్లు అందుకున్న ప్లేయర్గా అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలోనే అందరూ కూడా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు గురించి మాట్లాడుతూ ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారూ అని చెప్పాలి.
ఇలాంటి సమయంలోనే ఇక టీమ్ ఇండియాలో మరో బౌలర్ సాధించిన రికార్డు మాత్రం అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా ఫేసర్ మహమ్మద్ షమీ ఒక రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మట్లలో కలిపి 400 ప్లస్ వికెట్ల సాధించిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో మహమ్మద్ షమీ 9వ స్థానంలో నిలిచాడు. డేవిడ్ వార్నర్ వికెట్ తీయడం ద్వారా ఈ ఘనత సాధించాడు అని చెప్పాలి. 61 టెస్టుల్లో 217 వికెట్లు.. 87 వన్డేల్లో 159వికెట్లు.. 23 టీ20లో 24 వికెట్లు పడగొట్టాడు.