టెస్ట్ సిరీస్.. ఆస్ట్రేలియాదే విజయం : డుమిని

praveen
ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలోనే వార్మప్ మ్యాచ్ లేకుండానే నేరుగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఇక భారత్లో ఉన్న స్పిన్ పిచ్ లపై ఇక పటిష్టమైన భారత జట్టును ఎదుర్కొనేందుకు తీవ్రంగా ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంది ఆస్ట్రేలియా జట్టు.. ఈ క్రమంలోనే ఈసారి ఎవరు పై చేయి సాధిస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారబోతుంది.

 ఇక జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్న నేపథ్యంలో ఇరు జట్లు కూడా ప్రస్తుతం ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగబోతుంది అన్నది తెలుస్తుంది. ఇక ఇదే విషయంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు అని చెప్పాలి. కొంతమంది ఆస్ట్రేలియా గెలుస్తుందని చెబుతూ ఉంటే మరి కొంతమంది సొంత గడ్డపై టీం ఇండియాని ఓడించడం అసాధ్యమని ఇక టీమిండియాదే సిరీస్ అంటూ అభిప్రాయపడుతున్నారు.

 ఇకపోతే ఇటీవల ఇదే విషయం పై సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ జెపి డుమిని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఆస్ట్రేలియా టీమ్ ఇండియా మధ్య జరగబోయే బోర్డర్ గవాస్కర్ సిరీస్ ను ఆస్ట్రేలియా జట్టు 2-1 తేడాతో సొంతం చేసుకుంటుంది అంటూ జోస్యం చెప్పాడు జేపీ డుమిని. ఆస్ట్రేలియా ప్లేయర్ ఉస్మాన్ ఖజావా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలుస్తాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ టెస్ట్ సిరీస్లో రవిచంద్రన్ అశ్విన్ భారత జట్టుకు కీ ప్లేయర్ అని.. అతని స్పిన్ దాటిని ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా ప్రత్యేకంగా ప్రణాళికలను రచించాలి అంటూ జేపీ డుమిని సూచించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: