మళ్లీ క్రికెట్ ఆడతానో లేదో అనుకున్నా : జడేజా

praveen
టీమిండియా జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా గత ఏడాది ఆసియా కప్ జరుగుతున్న సమయంలో గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. మోకాలి శాస్త్ర చికిత్స కావడంతో చివరికి టి20 వరల్డ్ కప్ కి కూడా అతను అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలోనే జట్టులో సూపర్ ఆల్ రౌండర్ గా కీలక ప్లేయర్గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా ఇలా జట్టుకు కొన్ని నెలల పాటు దూరం కావడంతో టీం ఇండియా వ్యూహాలు మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయాయి. అయితే జడేజా లాంటి ప్లేయర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇక భారత్ సెలక్టర్లు  ఎంతో మందితో ప్రయోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే గాయం బారిన పడిన తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాడు రవీంద్ర జడేజా. ఇక ఎట్టకేలకు గాయం నుంచి కోలుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ముందుగా రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర జట్టు తరఫున కొన్ని మ్యాచ్లు ఆడాడు. ఇక అక్కడ మంచి ప్రదర్శన చేయడంతో మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు అతను అందుబాటులో ఉండబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక గాయం సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి ఇటీవల రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 తాను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో నా గాయం త్వరగా మానడానికి ఆదివారం సెలవు రోజు అయినా సరే ఫిజియోలు వచ్చి నాకు ట్రైనింగ్ ఇచ్చేవారు. వాలి వల్లే త్వరగా కోలుకోగలిగాను. అయితే వ్యక్తిగత అవసరాలకు కూడా వేరొకరి మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇలాంటి గడ్డ పరిస్థితులు నన్ను ఆందోళనకు గురి చేసాయ్. ఇక టి20 వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తున్నప్పుడల్లా నేను అక్కడ ఉంటే బాగుండేది అనే భావన నాలో కలిగింది. మళ్లీ క్రికెట్ ఆడతానో లేదో అని అనుకున్నాను. కుటుంబం స్నేహితుల సహకారంతోనే ఇక త్వరగా కోలుకోగలిగాను అంటూ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. 90 గంటల పాటు పేస్టు మ్యాచ్లో మైదానంలో ఉండగలనా అనే అనుమానం కలిగింది. కానీ రంజీ ట్రోఫీలో ఆడినప్పుడు కాస్త కష్టంగా ఉన్న మంచి ప్రదర్శన చేశాను. మళ్ళీ టీమ్ ఇండియాలోకి రావడం సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: