టీం
ఇండియా స్టార్ ఓపెనర్ ఇంకా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్
కేఎల్ రాహుల్,
బాలీవుడ్ యంగ్
అతియా శెట్టి చాలా కాలం సహజీవనం చేసి ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు.వీరు ఇద్దరూ కూడా చాలా కాలం నుంచి డేటింగ్లో ఉన్నారు. ఇక ముంబైలో ఇద్దరూ చాలా సింపుల్‌గా కేవలం కొద్ది మంది సన్నిహితుల మధ్య
పెళ్లి చేసుకోని ఏడు అడుగులు బంధంతో ఒక్కటయ్యారు.
కేఎల్ రాహుల్ ఇంకా అతియా వివాహానికి కొన్ని సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.అయితే కొన్ని రోజుల తర్వాత గ్రాండ్ రిసెప్షన్ అనేది ఉండనుంది. దీనికి దాదాపు మూడు వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది.ఇక
మీడియా నివేదికల ప్రకారం ఐపీఎల్ ఫ్రాంచైజీ
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని
సంజీవ్ గోయెంకా, మెంటర్
గౌతమ్ గంభీర్, ఫాస్ట్ బౌలర్
వరుణ్ ఆరోన్‌లు...
కేఎల్ రాహుల్ ఇంకా అతియా శెట్టిల పెళ్ళికి హాజరయ్యారు.ఇక
న్యూజిలాండ్ సిరీస్ కారణంగా రోహిత్ శర్మ,
విరాట్ కోహ్లీ,
హార్దిక్ పాండ్యా వంటి క్రికెటర్లు వివాహానికి హాజరు కాలేకపోయారు.ఇక
పెళ్లి తర్వాత
కేఎల్ రాహుల్ అలాగే
అతియా శెట్టి ఇద్దరు హనీమూన్ కి వెళ్లే అవకాశం లేదని సమాచారం తెలుస్తుంది.
నిజానికి ప్రస్తుతం KL
రాహుల్ షెడ్యూల్ కూడా చాలా ఎక్కువ ఉంది. అలాంటి పరిస్థితిలో
పెళ్లి తర్వాత తన పనిలో బిజీగా ఉంటాడు.ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం
కేఎల్ రాహుల్ మునుపటిలా అంతగా ఫాంలో లేడు.
భారత్,
బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో కెప్టెన్ గా
కేఎల్ రాహుల్ అంతగా రాణించలేకపోయాడు. ఆ పిచ్ పై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను చాలా కష్టపడ్డాడు. తన పేలవ ప్రదర్శనతో
రాహుల్ చాలా రకాలుగా విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అతని ఆటపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ కి
రాహుల్ దూరమయ్యే అవకాశం ఉందని కూడా జాఫర్ చెప్పాడు.ఇంకా అలాగే బంగ్లాదేశ్‌లో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో చాలా పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు మ్యాచ్‌ల
హోమ్ టెస్ట్ సిరీస్‌కు KL
రాహుల్ తుదిజట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని కూడా జాఫర్ అభిప్రాయపడ్డాడు.
బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల నాలుగు ఇన్నింగ్స్‌ల్లో KL
రాహుల్ వరుసగా 22, 23, 10, 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ముఖ్యంగా KL
రాహుల్ 2022లో నాలుగు టెస్టుల్లో 17.13 సగటుతో 137 పరుగులు మాత్రమే చేశాడు.ఇక ముందు టీంలో కొనసాగాలంటే ఖచ్చితంగా KL
రాహుల్ మంచి ప్రదర్శన చెయ్యాలి. లేదంటే కష్టమే..