నేడే రెండో వన్డే మ్యాచ్.. సిరీస్ పై కన్నేసిన టీమ్ ఇండియా?

praveen
ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టుతో అటు భారత జట్టు వరుసగా సిరీస్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే టీ20 సిరీస్ లో భాగంగా 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా జట్టు 2023 కొత్త ఏడాదిలో శుభారంభం చేసింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో అటు భారత జట్టు శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల మొదటి వన్డే మ్యాచ్లో భాగంగా ఘనవిజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే.


 టీమిండియాలో ఆడుతున్న ప్రతి బ్యాట్స్మెన్ కూడా అద్భుతంగా రానించడంతో ఏకంగా 67 పరుగుల తేడాతో మొదటి వన్డే మ్యాచ్లో విజయం సాధించి 1-0 తేడాతో ఆదిత్యాన్ని సంపాదించింది భారత జట్టు. ఇకపోతే నేడు ఎంతో కీలకమైన రెండో వన్డే మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన శ్రీలంక జట్టు అటు గట్టి పోటీ ఇచ్చి.. ఇక రెండో వన్డే మ్యాచ్లో విజయం సాధించాలని భావిస్తుంది. తద్వారా సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలతో ఉంది అని చెప్పాలి. అదే సమయంలో ఇక టి20 సిరీస్ గెలిచిన జోరుని వన్డే సిరీస్ లో కూడా కొనసాగించాలని భావిస్తుంది టీం ఇండియా.


 ఈ క్రమంలోనే ఇప్పటికే మొదటి వన్డే మ్యాచ్లో గెలిచిన టీమ్ ఇండియా ఇక ఇప్పుడు నేడు జరగబోయే రెండో వన్డే మ్యాచ్లో కూడా గెలిచి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. కాగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండో వన్డే మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే మొదటి వన్డే మ్యాచ్ లో భాగంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మఫామ్ లోకి రావడం.. ఇక టీమిండియా కు కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. ఏం జరగబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: