ఇది హిస్టరీనే.. రంజి ట్రోఫీలో మహిళా అంపైర్లు?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకుంటున్న నిర్ణయాలు అటు ప్రపంచ క్రికెట్లో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి అని చెప్పాలి.  ముఖ్యంగా క్రికెట్లో మహిళలు పాత్రను మరింత పెంచే విధంగా బీసీసీఐ ఎన్నో అనూహ్యమైన  నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అటు మహిళా క్రికెటర్లను ప్రోత్సహించే విధంగా ఐపీఎల్ నిర్వహించడానికి కూడా సిద్ధమైంది. ఇక పురుష క్రికెటర్లతో సమానంగానే మహిళా క్రికెటర్ల వేతనాలు కూడా చెల్లించేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే.


 బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఇక ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇక సమయంలో మరికొన్ని రోజుల్లో పురుషుల క్రికెట్లో మహిళ అంపైర్లను కూడా భాగం చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు ఈ నిర్ణయాన్ని బిసిసిఐ అమలులో పెట్టింది అన్నది తెలుస్తుంది. ఏకంగా రంజీ ట్రోఫీలో భాగంగా మహిళ ఎంపైర్లు అరంగేట్రం చేసి సరికొత్త రికార్డు సృష్టించారు అని చెప్పాలి. వృందారాటి, జనని నారాయన్, గాయత్రి వేణుగోపాలన్ రంజి ట్రోఫీలో భాగంగా మహిళ ఎంపైర్లుగా  అరంగేట్రం చేశారు.


 ఇటీవల జరిగిన రంజి మ్యాచుల్లో భాగంగా ముగ్గురు కూడా అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించారు అని చెప్పాలి. ఝార్ఖండ్, ఛత్తీస్గడ్ మధ్య జరిగిన మ్యాచ్లో గాయత్రి.. రైల్వేస్, త్రిపుర జరిగిన పోరులో జనని.. గోవా, పాండిచ్చేరి మధ్య జరిగిన మ్యాచ్లో వృందా అంపైర్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి.. ఇలా బిసిసిఐ పురుషుల క్రికెట్లో మహిళ ఎంపైర్లకు  స్థానం కల్పిస్తూ  నిర్ణయం తీసుకొని.. ఇక ఇప్పుడు దానిని అమలులో పెట్టడం మాత్రం హాట్ టాపిక్ ఆ మారిపోయింది అని చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో ఐపీఎల్ లో కూడా ఇలా మహిళ అంపైర్లు అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది అన్నది మాత్రం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: