రోహిత్ తన హాఫ్ సెంచరీని.. ఎవరికి అంకితమిచ్చాడో తెలుసా?
అయితే వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ ఇటీవల మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది. 2023 ఏడాదిని ఇక ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ తో ప్రారంభించాడు రోహిత్ శర్మ.ఇక తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు అని చెప్పాలి. తద్వారా ఇక ఈ ఏడాది రోహిత్ బ్యాటింగ్ విధ్వంసం కొనసాగిస్తాడు అనే నమ్మకాన్ని అభిమానుల్లో కలిగించాడు. 41 బంతుల్లోని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఈ ఇన్నింగ్స్ లో ఓవరాల్ గా 67 బంతుల్లో 9 ఫోర్లు మూడు సిక్సర్ల సహాయంతో 83 పరుగులు చేశాడు.
దీంతో ఇక రోహిత్ శర్మ సెంచరీ చేయడం ఖాయం అని అనుకున్నారు అభిమానులు. కానీ ఇక 83 పరుగుల వద్ద తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేర్చుకున్నాడు. మధు శంక బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా రోహిత్ శర్మ అల్లారు ముద్దుగా పెంచుకున్న మ్యాజిక్ అనే కుక్కపిల్ల ఇటీవల చనిపోయింది. ఈ విషయాన్ని రోహిత్ భార్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే మ్యాజిక్ లేదన్న బాధలోనే ఇక ఈ మ్యాచ్లో బరిలోకి దిగిన రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి కాగానే ఇక తన అర్థ సెంచరీని తన ప్రియమైన కుక్కపిల్ల మ్యాజిక్కు అంకితం ఇస్తూ ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.