యోయో ఎందుకు.. గవాస్కర్ షాకింగ్ కామెంట్స్?

praveen
గత కొంత కాలం నుంచి టీమిండియాను గాయాలు బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. కీలకమైన టోర్నీల సమయంలో ఇక జట్టులో స్టార్ పేర్లుగా కొనసాగుతున్నవారు గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవుతూ ఉండడంతో ఇక జట్టు వ్యూహాలు మొత్తం తారుమారు అయిపోతూ ఉన్నాయి. తద్వారా చాలి చాలని బలంతోనే ప్రత్యర్ధులను ఎదుర్కొంటున్న టీమిండియా ఘోర పరాభవాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇటీవల బీసీసీఐ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా యోయో టెస్టును మళ్లీ తీసుకు రావాలని నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యోయో టెస్ట్ తో పాటు ఎముకల దృఢత్వాన్ని తెలియజేసే డెక్సా పరీక్షలు కూడా ఆటగాళ్లకు నిర్వహించబోతున్నారు. ఈ టెస్టులలో పాసైన ఆటగాళ్లు ఇక భారత జట్టులో కనిపించబోతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఈ నిర్ణయాన్ని అటు దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాత్రం తప్పుపడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఒక బ్యాట్స్మెన్ సెంచరీల మీద సెంచరీలు కొట్టిన.. బౌలర్ ఓవర్ల మీద ఓవర్లు వేసిన.. పది వికెట్ల ఘనతలు సాధించిన కూడా ఒకవేళ బీసీసీఐ పెట్టే ఈ పరీక్షలో పాస్ కాకపోతే  మాత్రం జట్టులో ఉండడానికి అతను అనర్హుడు అవుతాడు. ఇది ఏ మాత్రం సమంజసం కాదు. నేను పాఠశాలలో క్రికెట్ ఆడుతున్నపడి నుంచి నాకు ఒక ఇబ్బంది ఉండేది. మైదానంలో కొన్ని రౌండ్లు వేసిన తర్వాత పిక్క కండరాలి ముందరి భాగంలో బాగా నొప్పి వచ్చేది. నడవడం కూడా కష్టమయ్యేది. ఇక ఎవరు ఎక్కువ దూరం పరిగెత్తుతారు అన్నది పరిగణలోకి తీసుకొని సెలెక్షన్ చేస్తే నన్ను తీసుకోవద్దని చెప్పాను. ఫిట్నెస్ అనేది వ్యక్తిగతమైనది. అందరికీ ఒకే రకమైన ప్రమాణాలు అవసరం లేదు. ఒక్కొక్కరికి ఒక్కో రీతిలో ఫిట్నెస్ అవసరం ఉంటుంది అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: