సూర్య పాక్ లో పుట్టి ఉంటే.. అంతే సంగతి : సల్మాన్ బట్
ఇక సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ దాటికి ఇక ప్రత్యర్థి శ్రీలంక బౌలర్లు ఎక్కడ బంతివేయాలో తెలియక బిక్క ముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. టి20 ఫార్మాట్లో ఇక సూర్య కుమార్ యాదవ్‌ను మించిన బ్యాట్స్‌మెన్ లేడు అంటూ ఎంతో మంది అతని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ మాత్రం సూర్య కుమార్ యాదవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో ఆడి ఉంటే మాత్రం అతడు అందరిలాగే బాధితుల్లో ఒకడిగా ఉండేవాడని.. ఇలాంటి ప్రదర్శన చేసేందుకు అవకాశం వచ్చేది కాదు అంటూ వ్యాఖ్యానించాడు సూర్య కుమార్ యాదవ్. అతని ఫిట్నెస్ బ్యాటింగ్ చూస్తుంటే ముచ్చటేస్తుంది.. ఏ బౌలర్ ఎలాంటి బంతి వేస్తాడో.. అతనికి ముందే తెలిసినట్లు అనిపిస్తుంది అంటూ సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు. అతను ఇండియాలో పుట్టడం అతని అదృష్టమని.. ఎందుకంటే 30 ఏళ్ల వయసులో జట్టులోకి వచ్చి రాణిస్తున్నాడని.. అదే పాకిస్తాన్ లో పుట్టి ఉంటే 30 ఏళ్లు ఉన్న సూర్యకుమార్ ఇక జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న బాధితుల జాబితాలో ఉండేవాడు అంటూ సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు.