అలాంటి సమయంలో.. పాండ్య ఎందుకు బౌలింగ్ వేయట్లేదు?

praveen
భారత జట్టుకు ఫ్యూచర్ కెప్టెన్ ఎవరో కాదు హార్దిక్ పాండ్యా అని ప్రస్తుతం అందరూ అనుకుంటున్నా వేళ ఇక ఇటీవల శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ కోసం ఏకంగా హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ కెప్టెన్సీ బాధితులు అప్పగించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పటికే కెప్టెన్గా తన సత్తా ఏంటో నిరూపించిన హార్దిక్ పాండ్యా ఒకవైపు జట్టును కెప్టెన్గా ముందుకు నడిపిస్తూనే మరోవైపు ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టులో కీలక ఆటగాడిగా కూడా రాణిస్తూ వున్నాడు అని చెప్పాలి.


 ఇక ఇప్పుడూ శ్రీలంకతో జరుగుతున్న టి20 సిరీస్ లో కెప్టెన్సీ వహిస్తున్న హార్దిక్ పాండ్యా ఎందుకో తన ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక మొదటి మ్యాచ్ లో భాగంగా టీమిండియా విజయం సాధించినప్పటికీ రెండో మ్యాచ్లో మాత్రం టీమిండియా అనుకున్న స్థాయిలో ప్రదర్శన చేయలేక 16 పరుగులు తేడాతో ఓడిపోయింది. దీంతో ఇక సిరీస్ కైవసం చేసుకోవాలంటే మాత్రం మూడో మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. అయితే శ్రీలంకతో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో భాగంగా ఇండియా ప్రదర్శన పై ప్రస్తుతం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


 అయితే ఇటీవల రెండో టి20 మ్యాచ్లో భారత బౌలింగ్లో అటు శ్రీలంక బ్యాట్స్మెన్లు దంచి కొట్టారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అనుభవం లేని ఆటగాళ్లకు హార్దిక్ పాండ్యా బంతి అప్పజెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఎంతో మంది విశ్లేషకులు మండిపడుతున్నారు. డెత్ ఓవర్లు సహా కీలకమైన ఓవర్లలో బౌలింగ్ బాధ్యతలను స్వయంగా హార్దిక్ పాండ్యా అందుకోకుండా జూనియర్లకు ఇవ్వడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. చాలెంజ్ పేరుతో జూనియర్లను భయపెట్టడం ఏంటి.. ఇలా చేయడం అంటే వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నట్లు కదా అంటూ విశ్లేషకులు హార్దిక్ పాండ్యా తీరుపై ఫైర్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: