టీమిండియా కెప్టెన్సీకి.. అతను సరైనోడే : సంగక్కర

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా వైఫల్యం తర్వాత ఇక టీమిండియా జట్టుకు టి20 ఫార్మాట్లో కెప్టెన్ ను మార్చాల్సిన అవసరం ఉంది అంటూ ఒక కొత్త డిమాండ్ తెరమీదకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి కెప్టెన్సీ రేసులో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ సాహ మరి కొంతమంది పేర్లు వినిపించాయి. కానీ ఇటీవల కొత్త పేరు తెరమీదకి వచ్చింది. ఏకంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా సూపర్ సక్సెస్ అయ్యి మొదటి ప్రయత్నంలోనే టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యాకు టీమిండియా కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుంది అనే డిమాండ్ తెరమీదకి వచ్చింది.


 హార్థిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించి అటు టి20 జట్టులో ఎంతోమంది యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చి సీనియర్లను కేవలం వన్డే టెస్ట్ ఫార్మాట్లకు మాత్రమే పరిమితం చేయాలని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి అయితే ఏకంగా హార్దిక్ పాండ్యా త్వరలో కెప్టెన్ గా మారబోతున్నాడు అన్న ప్రచారం కూడా మొదలైంది. అనుకున్నట్లుగానే ఇక కొత్త ఏడాదిలో శ్రీలంకతో జరగబోయే టి20 సిరీస్ కు రోహిత్ అందుబాటులో ఉన్నప్పటికీ హార్థిక్ పాండ్యాకు టి20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది టీమిండియా యాజమాన్యం.


 ఇకపోతే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ దక్కడంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు. కాగా ఇటీవల ఇదే విషయంపై శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర  స్పందించాడు. సాధారణంగా కెప్టెన్సీ బదిలీ తర్వాత అంతర్జాతీయ జట్లలో కాస్త గందరగోళం నెలకొంటుంది. కానీ టీమిండియా కు ఆ ఇబ్బంది లేదు అంటూ వ్యాఖ్యానించాడు. టి20 కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో  ఈ వ్యాఖ్యలు చేశాడు. హార్థిక్ పాండ్యాలో టాలెంటే కాకుండా మంచి నాయకుడు కూడా ఉన్నాడు. టీమిండియాను హార్దిక్ పాండ్యా ఎంతో సునాయాసంగా ముందుకు నడిపించగలడు అంటూ కుమార సంగకర ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: