టీమిండియాలో.. ఆ సీనియర్ ప్లేయర్ కెరియర్ ముగిసినట్లేనా?

praveen
టి20 వరల్డ్ కప్ లో వైఫల్యం తర్వాత టీమ్ ఇండియా సెలెక్టర్లు జట్టులో కేవలం యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్లకు విశ్రాంతి ప్రకటిస్తూ ఉండడం చేస్తున్నారు. ఇకపోతే ఇక కొత్త ఏడాదిలో అటు భారత పర్యటనకు రాబోతున్న శ్రీలంకతో వరుసగా సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది టీమిండియా జట్టు.. ఈ క్రమంలోనే ఇటీవల వన్డే టి20 జట్టుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది బీసీసీఐ.

 టి20 సిరీస్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహిస్తూ ఉండగా వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీ వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఈ సిరీస్ లో భాగంగా సీనియర్గా భువనేశ్వర్ కుమార్ కు చోటు లేకుండా పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక అతని కెరియర్ ముగిసింది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు. భువనేశ్వర్ కుమార్ ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో రాణించలేకపోయాడు. నవంబర్లో న్యూజిలాండ్తో చివరి టీ20 సిరీస్ ఆడాడు. అదే సమయంలో వన్ డే ఫార్మాట్  కి కూడా పూర్తిగా దూరమైపోయాడు. ఇక ఆ తర్వాత టి20 ప్రపంచ కప్ ఆసియా కప్ లో పేలవ ప్రదర్శన ద్వారా అతని కెరియర్ పూర్తిగా ప్రశ్నార్థకమైపోయింది అని చెప్పాలి.

 32 ఏళ్ళ వయసున్న భువనేశ్వర్ కుమార్ పేలమైన ఫామ్ చూస్తూ ఉంటే అతనికి రానున్న రోజుల్లో కూడా జట్టులో చోటు దక్కే అవకాశం చాలా తక్కువగానే కనిపిస్తుంది. అదే సమయంలో ఇక కొత్త బౌలర్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో భువనేశ్వర్ కుమార్ కెరియర్ ముగిసినట్లే అని క్రికెట్ విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు.
శ్రీలంకతో జరిగిన టీ20 టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్ హర్షల్ పటేల్ మాలిక్, శివం మావి, ముఖేష్ కుమార్.
వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, మహ్మద్ సిరాజ్ అర్ష్దీప్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: