భారత జట్టులో ఉన్నప్పుడే.. సివిల్స్ క్లియర్ చేసిన ప్లేయర్ ఎవరో తెలుసా?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో బాగా రాణించాలని భావించే క్రికెటర్లు చిన్నప్పటి నుండి క్రికెట్ ఊపిరిగా బ్రతుకుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది క్రికెటర్లు అయితే ఏకంగా చదువు సంధ్య పక్కకు పెట్టేసి ఇక క్రికెట్ పైన దృష్టి పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా చదువులో బాగా ఉత్తీర్ణులు కాకపోయినప్పటికీ క్రికెట్లో మాత్రం స్టార్లుగా ఎదుగుతూ ఉంటారు ఎంతోమంది. ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ క్రికెటర్లు సైతం ఒకప్పుడు చదువును పక్కన పెట్టి క్రికెట్ మీద దృష్టి పెట్టిన వారే ఉన్నారు అని చెప్పాలి.


 అంతేకాదు కేవలం పదవ తరగతి వరకు మాత్రమే చదివిన సచిన్ టెండూల్కర్ ఏకంగా భారత క్రికెట్లో క్రికెట్ దేవుడిగా కూడా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా క్రికెటర్ గా కొనసాగుతున్న వారు ఇక  చదువులపై దృష్టి పెట్టడం మాత్రం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక క్రికెటర్ మాత్రం ఒక వైపు క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చుకోవడమే కాదు మరోవైపు ఇక చదువులపై కూడా దృష్టి పెట్టి సత్తా చాటాడు అని చెప్పాలి. ఇలా ఆటలోనే కాదు చదువులో కూడా తనకు తిరుగులేదు అని నిరూపించుకున్నాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు టీమ్ ఇండియా తరపున ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్ ఖురేషియా.


 ఈయన 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు అని చెప్పాలి. ఇక ఇలా తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక తక్కువ సమయంలోనే అటు భారత జట్టు తరఫున కూడా ప్రాతినిధ్యం వహించాడు. 1999లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో చోటు సంపాదించుకున్నాడు ఖురేషియా. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లోనే 57 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అతని కెరియర్ లో 12 వన్డే మ్యాచ్లు ఆడాడు అని చెప్పాలి. అదే సమయంలో ఇక అటు సివిల్స్ లో కూడా ఉత్తీర్ణుడు కావడం గమనార్హం. దీంతో ఇక క్రికెట్ ను దూరం పెట్టి సివిల్స్ వైపు అడుగులు వేశాడు. కాగా ప్రస్తుతం సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు ఖురేషియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: