దివంగత షేన్ వార్న్ కు.. క్రికెట్ ఆస్ట్రేలియా అరుదైన గౌరవం?
కాగా ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో దిగ్గజ ప్లేయర్గా కొనసాగుతున్న దివంగత షేన్ వార్న్ కు కూడా ఇటీవల ఆ దేశ క్రికెట్ బోర్డు సముచిత గౌరవాన్ని ఇచ్చింది. షేన్ వార్న్ అటు ఆస్ట్రేలియా జట్టు తరఫున ఎన్నో ఏళ్ల పాటు క్రికెట్లో కొనసాగాడు. ఇప్పటికీ షేన్ వార్న్ సాధించిన ప్రపంచ రికార్డులు ఇప్పటికీ కూడా యువ ఆటగాళ్లు బ్రేక్ చేయలేకపోయారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల షేన్ వార్న్ గుండెపోటు కారణంగా ఆకస్మిక మరణం చెందడం కారణంగా క్రీడా ప్రపంచాన్ని మొత్తం విషాదంలో మునిగిపోయేలా చేసింది. ఇకపోతే షేన్ వార్న్ చేసిన సేవలను ఎంతో మంది మాజీ క్రికెటర్లు గుర్తు చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి.
ఇకపోతే ఇటీవల దివంగత దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సముచిత రీతిలో గౌరవించేందుకు సిద్ధమైంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్ అవార్డును షైన్ వార్న్ పేరిట ఇచ్చేందుకు సిద్ధమైంది క్రికెట్ ఆస్ట్రేలియా. గత మార్చిలో షేన్ వార్న్ మృతి చెందిన తర్వాత అతని సొంతమైదానం మెల్ బోర్న్ లో మొదటి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఈ విషయాన్ని ఆసిస్ క్రికెట్ బోర్డు స్వయంగా ప్రకటించింది. కాగా దిగ్గజం షేన్ వార్న్ అటు 145 టెస్ట్ లలో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించి 708 వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి.