ఇది నిజంగా చాలా కష్టంగా ఉంది : డేవిడ్ వార్నర్

praveen
సాధారణంగా క్రికెట్ జట్టులో స్టార్ పేర్లుగా కొనసాగుతున్న వారికి మిగతా ప్లేయర్లతో పోల్చి చూస్తే కాస్త మినహాయింపులు ఎక్కువగానే ఉంటాయి అని చెప్పాలి. స్టార్ ప్లేయర్లు ఏదైనా తప్పు చేసినా కూడా చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తూ ఉంటారు జట్టు యాజమాన్యం. ఒకవేళ ఏదైనా నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్ష వేయాల్సి వచ్చినప్పుడు కూడా ఇక ఈ శిక్షల్లో కూడా కఠిన తరమైనవి లేకుండా చూసుకుంటూ ఉంటారు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ ప్లేయర్ విషయంలో వ్యవహరించే తీరు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది.

 2018లో స్మిత్ కెప్టెన్ గా ఉండగా డేవిడ్ వార్నర్ వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఆ సమయంలో ఇక బాల్ టాంపరింగ్ చేశారు అన్న ఆరోపణలతో క్రికెట్ ఆస్ట్రేలియా వీరిపై నిషేధం విధించింది అన్న విషయం తెలిసిందే. అయితే అప్పుడు కెప్టెన్ గా ఉన్న స్మిత్ పై నిషేధం విధించి ఎత్తివేసిన క్రికెట్ ఆస్ట్రేలియా అటు డేవిడ్ వార్నర్ పై మాత్రం ఇక జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని విధించింది. అయితే ఇటీవల  కెప్టెన్సీ నిషేధం ఎత్తివేసేందుకు మళ్లీ అప్పీలు చేసుకునే అవకాశం రాగా ఇక డేవిడ్ వార్నర్ ఎంతలా రిక్వెస్ట్ చేసినప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా అతనిపై ఉన్న నిషేధం ఎత్తివేసేందుకు అంగీకరించలేదు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఇక గత కొంతకాలం నుంచి డేవిడ్ వార్నర్ పై క్రికెట్ ఆస్ట్రేలియా కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ టాక్ వినిపిస్తుంది. అయితే ఇక క్రికెట్ ఆస్ట్రేలియా వ్యవహరిస్తున్న తీరు తనను ఎంతో మానసిక వేదనకు గురి చేస్తుందంటూ ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు డేవిడ్ వార్నర్. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి తనకు కనీస మద్దతు లేకపోవడం దురదృష్టకరం అంటూ వ్యాఖ్యానించాడు. నేను జట్టు కెప్టెన్ అవ్వడం క్రికెట్ ఆస్ట్రేలియా కు ఇష్టం లేదు అన్న విషయం నాకు అర్థమైంది. ఇది నిజంగా నాకు కష్ట కాలంగా ఉంది. నా ఆటపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: