శ్రీలంకతో టి20 సిరీస్.. టీమిండియాకు స్టార్ ప్లేయర్ దూరం?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియా వరుసగా ద్వైపాక్షక సిరీస్ లతో బిజీ బిజీగా గడుపుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విదేశీ పర్యటనలకు వెళ్లడమే కాదు ఇక భారత పర్యటనకు వస్తున్న విదేశీ జట్లతో కూడా మూడు ఫార్మట్లలో సిరీస్ లు ఆడుతుంది టీమిండియా. ఇటీవల ఏకంగా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళింది అన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ లో ఓడిపోయి నిరాశపరిచిన టీమ్ ఇండియా జట్టు.. అటు టెస్ట్ సిరీస్ లో మాత్రం ఘన విజయాన్ని సాధించింది.


 ఇలా టెస్ట్ సిరీస్లో ఘన విజయం సాధించడం కారణంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోరులో అవకాశాలను మరింత మెరుగుపరచుకుంది అని చెప్పాలి. ఇకపోతే ఇక ఇప్పుడు కొత్త సంవత్సరంలో కూడా మళ్లీ వరుస సిరీస్ లతో బిజీ కావడానికి సిద్ధమవుతుంది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే శ్రీలంకతో టి20 సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టి20 సిరీస్ కు అటు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు  విశ్రాంతి ప్రకటించి యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఇక టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది.



 కాగా జనవరి 3వ తేదీ నుంచి ఇక శ్రీలంక టీమిండియా మధ్య టి20 సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టి20 సిరీస్ కు టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. కొత్త సంవత్సరంలో కేఎల్ రాహుల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీలంకలో జరిగే టి20 సిరీస్ కు అందుబాటులో ఉండడం లేదట. అయితే కేఎల్ రాహుల్ స్థానంలో యంగ్ ప్లేయర్కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. రాహుల్ స్థానంలో ఎవరు జట్టులోకి రాబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: