వారెవ్వా.. అజింక్య రహానే డబుల్ సెంచరీ?

praveen
భారత్ జట్టు లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా గుర్తింపు సంపాదించుకుంది కేవలం కొంతమంది మాత్రమే. ఇక అలాంటి ప్లేయర్ల లో అజింక్య రహానే కూడా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అనే ట్యాగ్ రావడం తో  పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి అతను పూర్తిగా దూరమయ్యాడు అంతేకాదు టీమిండియా తరఫున టెస్టుల్లో కూడా అడపాదడప అవకాశాలు మాత్రమే అందుకున్నాడు  గతంలో అతను బాగా రాణించినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు అని చెప్పాలి. అతని మునుపటి ఫామ్ లోకి వస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసారూ. కానీ కొన్నాళ్లపాటు అభిమానులకు నిరీక్షణ తప్పులేదు.

 ఈ క్రమంలోని టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయినప్పటికి అజింక్య రహానేకు  జట్టులో నుంచి ఉద్వాసన పలుకుతూ టీమిండియా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే ఇలా జట్టు నుంచి తప్పించినప్పటికీ నిరాశ చెందకుండా ఇక మళ్ళీ తన మునుపటి ఫామ్ అందుకోవటం కోసం తీవ్రంగా కష్టపడ్డాడు అజింక్య రహానే. ఈ క్రమంలోని ప్రస్తుతం రంజీ ట్రోఫీలో భాగంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఇటీవల అజంక్య రహనే రంజీ ట్రోఫీలో భాగంగా ఏకంగా డబుల్ సెంచరీ సాధించి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇటీవల హైదరాబాద్ ముంబై మధ్య మ్యాచ్ జరిగింది.. ఈ మ్యాచ్ లో భాగంగా తన బ్యాటింగ్ తో అద్భుతంగా రానించిన అజింక్య రహానే  డబుల్ సెంచరీ సాధించాడు. ఏకంగా
253 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. దీంతో ఫ్యాన్స్ అందరు కూడా ఆనందంలో మునిగిపోయారు. గత కొంతకాలం నుంచి ఫామ్ లేని తో ఇబ్బంది పడుతున్న అజించే రహనే తనపై వస్తున్న విమర్శలను డబుల్ సెంచరీ తో తిప్పుకొట్టాడు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: