వార్నీ.. మహమ్మద్ రిజ్వాన్ ఎంత గొప్పలకు పోయాడు?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమమైన దేశ వాలి క్రికెట్ లీగ్ ఏదంటే ప్రతి ఒక్కరు చెప్పేస్తారు. అది ఏదో కాదు బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగడమే కాదు.. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్ళతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిండిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ప్రతి ఏడాది ఎంతోమంది విదేశీ ప్లేయర్లు సైతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం కావడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనడం కారణంగా ఇక సరికొత్త అనుభూతుని పొందుతున్నామని ప్రపంచ క్రికెట్లో బాగా రాణించడానికి ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతుంది అంటూ ఇక విదేశీ క్రికెటర్లు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇక ఐపీఎల్ టోర్నీ గొప్పది అని ఒప్పుకోవడానికి అహం అడ్డు రావడంతో.. ఇక పాకిస్తాన్ సొంత క్రికెట్ లీగ్ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ జట్టులో ప్రస్తుతం స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న మహమ్మద్ రిజ్వాన్ ఇక ఇలాంటి గొప్పలకి పోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న టి20 లీగ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైంది అంటూ మహమ్మద్ రిజ్వాన్ పేర్కొన్నాడు. అయితే లీగ్ ల ప్రస్తావన వస్తే ఒకప్పుడు అంత భారత టీ20 లీగ్ గురించి మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రపంచంలోనే పాకిస్తాన్ సూపర్ అత్యంత కఠినమైనదిగా నిలిచింది. ఒకసారి పాకిస్తాన్ లీగ్ లో ఆడితే ఎవరైనా ఇదే మాట అంటారు. ఎందుకంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో బెంచ్ పై ఉండే రిజర్వు ఆటగాళ్లు సైతం అద్భుతంగా రాణించగలరు. మా దేశ టి20 లీగ్ ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యపరుస్తుంది. ఇక మొదట్లో ఈ లీగ్ ప్రారంభించినప్పుడు సక్సెస్ కాదని ఎంతోమంది అన్నారు. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది అంటూ మహమ్మద్ రిజ్వాన్ అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: