హమ్మయ్య.. 1443 తర్వాత.. పూజార సెంచరీ?

praveen
భారత క్రికెట్ లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు చటేశ్వర్ పూజార. అయితే ఇలా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా గుర్తింపు వచ్చిందో లేదో ఏకంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్కు అతను పూర్తిగా దూరమైపోయాడు అని చెప్పాలి. అందరూ క్రికెటర్లు టెస్ట్ ఫార్ముట్ తో పాటు పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో కూడా అవకాశం దక్కించుకుంటే.. పూజార మాత్రం కేవలం టెస్ట్ ఫార్మాట్ కి పరిమితమయ్యాడు. ఎంతో నెమ్మదిగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయి ఏకంగా ప్రత్యర్థి  బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు పూజార.

 అయితే కొన్ని కొన్ని సార్లు పూజార నెమ్మదైన ఆట తీరు అటు టీమిండియాకు ప్లస్ పాయింట్ గా మారితే కొన్నిసార్లు మాత్రం ఇక అభిమానులకు సైతం చిరాకు తెప్పించే విధంగా ఉంటుంది అని చెప్పాలి.  అయితే గత కొంతకాలం నుంచి ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పూజార చివరికి జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలోనే పట్టు విడువని విక్రమార్కుడిలా ఇక ఇంగ్లాండ్లో కౌంటింగ్ క్రికెట్లో ఆడి తనలోని కొత్త పూజారని బయటకు తీసుకువచ్చాడు. నెమ్మదైన ఆట తీరుకు కేరాఫ్ అడ్రస్ అయినా పూజార ఎంతో దూకుడుగా ఆడి సెంచరీలతో చెలరేగిపోయాడు.


 అయితే అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం పూజార సెంచరీ చేసి చాలా రోజులే అయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో పూజార సెంచరీ చేసేలాగే కనిపించాడు. కానీ 90 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు.  అయితే ఇటీవల రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం సెంచరీ నిరీక్షణకు తెరదింపాడు. చటోగ్రామ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో రాహుల్ అవుట్ కావడంతో క్రీజ్ లోకి వచ్చిన పూజార  130 బంతుల్లో 13 ఫోర్లు సాయంతో 102 పరుగులు చేశాడు. ఇక భారత్ రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేయగా.. మొత్తంగా 512 పరుగుల లీడ్ లోకి వచ్చింది. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.కాగా 1443 రోజుల తర్వాత పూజార సెంచరీ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: