విలియమ్సన్ షాకింగ్ నిర్ణయం.. అస్సలు ఊహించలేదంటున్న ఫ్యాన్స్?
అదే సమయంలో ఇక మూడు ఫార్మాట్లకు కూడా ప్రత్యేకమైన జట్టును ఆయా క్రికెట్ బోర్డులు సిద్ధం చేసుకుంటూ ఉన్నాయని చెప్పాలి. ఇక ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ సైతం మూడు ఫార్మాట్ లలో కొనసాగడం కష్టమే అని భావిస్తూ ఇక తమకు కాస్త కష్టం అనిపించిన ఏదో ఒక ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలా స్టార్ ప్లేయర్లు ఇక కొన్ని ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉండడం కాస్త ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా న్యూజిలాండ్ జట్టుకు మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న కేన్ విలియమ్సన్ కూడా ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
ఏకంగా టెస్ట్ సారధ్య బాధ్యతలను వదిలేస్తున్నట్లు ఇటీవల కేన్ విలియమ్సన్ ప్రకటించాడు. దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు అని చెప్పాలి. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి కెప్టెన్ గా కొనసాగుతాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే కేన్ విలియమ్సన్ ప్రస్తుతం కెప్టెన్సీ వదిలేసిన నేపథ్యంలో ప్రస్తుతం జట్టులో సీనియర్ గా కొనసాగుతున్న టీమ్ సౌథి టెస్ట్ జట్టు పగ్గాలు అందుకోబోతున్నాడు. కాగా కేన్ విలియమ్సన్ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యూజిలాండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ విజేతగా కూడా నిలిచింది.