బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్.. అశ్విన్ ఆ రికార్డు సాధిస్తాడా?
ఇకపోతే రోహిత్ శర్మ గాయపడిన నేపథ్యంలో ఇక ఇప్పుడు వైస్ కెప్టెన్ గా ఉన్న రాహుల్ సారాధ్య బాధితులను అందుకున్నాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ కెప్టెన్సీ లో నేటి నుంచి టెస్ట్ సిరీస్ లో బరిలోకి దిగింది టీం ఇండియా జట్టు. ఈ క్రమంలోనే మొదట బ్యాటింగ్ ఎంచుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్లో విజయం సాధించడం అటు భారత జట్టుకు ఎంతో ముఖ్యమని చెప్పాలి. ఇది ఇలా ఉంటే ఇక బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత ఆటగాళ్లను ఎన్నో అరుదైన రికార్డులు కూడా ఊరిస్తున్నాయి అని చెప్పాలి.
ముఖ్యంగా భారత జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు సృష్టిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన కెరియర్ లో 93 టెస్ట్ మ్యాచ్ లలో 450 వికెట్లు పడగొట్టాడు. ఇక అశ్విన్ 86 టెస్ట్ మ్యాచ్లోనే 442 వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. ఇక మరో ఎనిమిది వికెట్లు తీశాడు. అంటే చాలు ఇక అత్యధిక వికెట్లు పడగొట్టిన ప్లేయర్గా కొనసాగుతున్న అనిల్ కుంబ్లే నూ అశ్విన్ అధికమించడం సాధ్యమవుతుంది. అంతేకాదు ఎనిమిది వికెట్లు తీస్తే అదే తక్కువ మ్యాచ్లోనే 450 టెస్ట్ వికెట్లు తీసిన స్పిన్ బౌలర్గా కూడా అశ్విన్ అరుదైన ఘనత సాధిస్తాడు. మరి బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్లో అశ్విన్ ఈ రికార్డు సాధిస్తాడో లేదో చూడాలి.