
ఐపీఎల్ 2023.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే?
ఇక డిసెంబర్ 23వ తేదీన జరగబోయే మినీ వేలం కోసం ఏకంగా 991 మంది ఆటగాళ్లు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇక ఇందులో భారత్ కు చెందిన ఆటగాళ్లు ఎక్కువమంది ఉన్నారు అని చెప్పాలి. ఈ మినీ వేలంలో ఎవరు ఏ జట్టులోకి వెళ్ళబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఐపీఎల్ ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. మార్చి 31 నుంచి లేదా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి ఐపీఎల్ 16వ సీజన్ కు సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే అయితే ఐపీఎల్ 2023 సీజన్ మొదటి మ్యాచ్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందట. ఇక ఈ విషయాన్ని బీసీసీఐ ప్రధాన కార్యాలయం నుంచి వస్తున్న నివేదికలు చెబుతున్నాయి అన్నది తెలుస్తుంది. అయితే ఐపీఎల్ మార్చ్ 3వ తేదీ నుంచి ప్రారంభమై 26వ తేదీ వరకు కొనసాగుతుందని గతంలో ప్రచారం కూడా జరిగింది. మరీ ఇక ఇందులో ఏది నిజం అన్నది తెలియాలంటే మాత్రం బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 23వ తేదీన మినీ వేల ముగిసిన తర్వాత బిసిసి ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది.