ఐపీఎల్ లో ఆడటంపై.. అతను నిర్ణయాన్ని మార్చుకోవచ్చు : ఆసిస్ కోచ్

praveen
2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో మినీ వేలం ప్రక్రియ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మినీ వేలంలో ఎంతోమంది ఆటగాళ్లు తమ పేరును దరఖాస్తు చేసుకున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరున్ గ్రీన్ కూడా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. మొదటిసారి ఐపీఎల్ కోసం దరఖాస్తు చేసుకుని.. ఇక భారత టి20 లీగ్ లో ఆడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు ఈ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్.

 ఈ క్రమంలోనే కామరూన్ గ్రీన్ ఐపీఎల్లోకి అరంగేట్రం చేయడంపై ఇక ఆస్ట్రేలియా జట్టులో ఉన్న సహచర ఆటగాళ్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉండటం గమనార్హం. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత విపరీతమైన బిజీ షెడ్యూల్ కారణంగా కామరూన్ గ్రీన్ ఇక విరామం లేక విపరీతమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. అంతే కాదు 2023 ప్రపంచ కప్ ముంగిట కామెరున్ గ్రీన్ భారత టి20 లీగ్ ఆడాలని తీసుకున్న నిర్ణయం కాస్త తన ప్రదర్శన పై ప్రభావం చూపుతుందని డేవిడ్ వార్నర్, పాట్ కమ్మిన్స్ లాంటి వాళ్లు కూడా కామెంట్ చేశారు.

 ఇక ఇటీవలే ఆస్ట్రేలియా జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న ఆండ్రూ మెక్ డోనాల్డ్ సైతం ఈ విషయంపై స్పందించాడు. రానున్న మూడు నెలల్లో ఏదైనా జరగవచ్చు అంటూ వ్యాఖ్యానించాడు. ఇక కామరూన్ గ్రీన్ తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. మార్చి నెలాఖరులోగా గ్రీన్ నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉంటాయో. ఈ మూడు నెలల కాలంలో అతడు చాలా మ్యాచులు ఆడాల్సి ఉంది. కచ్చితంగా భారత టీ20 లీగ్ పై అతడు ఇప్పుడే ఓ నిర్ణయానికి రాడు. శరీరం ఎప్పుడు ఎలా స్పందిస్తుందో చెప్పలేం. రానున్న కొద్ది రోజుల్లో తొమ్మిది టెస్టులు ఒక వైట్ బాల్ క్రికెట్ మ్యాచ్ కామెరూన్ గ్రీన్ ఆడాల్సి ఉంది అంటూ కోచ్  మేక్ డోనాల్డ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: