రెండో వన్డే మ్యాచ్.. టీమిండియా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్?
ఇకపోతే ఇటీవల శిఖర్ ధావన్ కెప్టెన్సీలో టీమిండియా వన్డే సిరీస్ లో బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే హోరాహోరీగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ధావన్ సేన పోరాడి ఓడింది అని చెప్పాలి అయితే మొదటి మ్యాచ్లో ఓటమితో న్యూజిలాండ్ ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలోనే సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలి అంటే మాత్రం రెండో వన్డే మ్యాచ్లో భారత జట్టు తప్పనిసరిగా విజయం సాధించాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్ గురించి అటు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇక హోమిల్టన్ వేదికగా నేడు ఇండియా న్యూజిలాండ్ మధ్య రెండవ వన్డే మ్యాచ్ జరుగుతూ ఉండగా.. ఈ మ్యాచ్ జరగడం మాత్రం ప్రస్తుతం అనుమానంగానే కనిపిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి న్యూజిలాండ్ లోని పలు ప్రాంతాలలో వరుసగా వర్షం కురుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ వర్షం కారణంగా టి20 సిరీస్ లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు రెండో వన్డే మ్యాచ్ లో కూడా 91% వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాకు ఎంతో కీలకమైన రెండో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయి ఛాన్స్ ఉందని తెలిసి టీమిండియా ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు.