
సూసైడ్ చేసుకోవాలని.. ఆరో అంతస్తు నుంచి దూకాడు.. అయినా అతను సేఫ్?
ముఖ్యంగా పెద్ద పెద్ద బిల్డింగ్లపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. సాధారణంగా ఆరవ అంతస్తు నుంచి కిందికి దూకినప్పుడు ఇక సదరు వ్యక్తి ప్రాణులతో బయటపడటం అనేది అసాధ్యం అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఆరవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పటికీ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో మంత్రాలయ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో వెలుగులోకి వచ్చింది.
ఒక వ్యక్తి ఏకంగా ఢిల్లీలోని అడ్మినిస్ట్రేటివ్ భవనం ఆరో ఫ్లోర్ కి చేరుకుని అక్కడ నుంచి కిందకు దూకుడు. అయితే కింద రక్షణగా బలమైన నెట్ ఏర్పాటు చేయడంతో ఇక అతను ఎలాంటి గాయాలు కాకుండానే ప్రాణాలతో బయటపడ్డాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. తన ప్రేయసి పై కొంతకాలం క్రితం అత్యాచారం జరిగింది. దీని గురించి ఎవరికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. నిందితులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. సీఎంకు లేఖలు రాసిన స్పందన లేదు. దీంతో విసుకు చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు సదరు వ్యక్తి చెప్పకు వచ్చాడు.