నాకు ముందే తెలుసు.. షాకిచ్చిన కేన్ విలియమ్సన్?

praveen
2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఇటీవల రీటెన్షన్ ప్రక్రియ పూర్తయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్లో ఉన్న అన్ని జట్లు కూడా తాము వదులుకోబోయే ఆటగాళ్ల వివరాలను బీసీసీఐకి ప్రకటించాయి. ఇక అదే సమయంలో తమతో అంటి పెట్టుకోవాలనుకున్న ఆటగాళ్ల వివరాలను కూడా ప్రకటించాయి అని చెప్పాలి. అయితే ఇక కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఏకంగా 16 మంది ఆటకాళ్లను వదులుకోగా.. ముంబై ఇండియన్స్ జట్టు 13 మంది ఆటకాళ్లను వేలంలోకి వదిలేసింది. అదే సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఏకంగా 12 మంది ఆటగాళ్లను వదులుకోవడం గమనార్హం.


 ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో బెస్ట్ కెప్టెన్లలో ఒకడిగా కొనసాగుతున్న న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ను వదులుకుంటున్నట్లు అటు సన్రైజర్స్ జట్టు ప్రకటించింది. దీంతో ఇది కల లేకపోతె నిజమా అని నమ్మలేకపోయారు అభిమానులు. కేన్ విలియమ్సన్  లాంటి ఆటగాడిని సన్రైజర్స్ వదులుకోవడమేంటి అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇకపోతే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తనను వేలంలోకి వదిలేయడం గురించి స్వయంగా కేన్ విలియంసన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 సన్ రైజర్స్ తనను వదిలేస్తుంది అన్న విషయం ముందే తెలుసు. ఈ విషయంపై జట్టు యాజమాన్యం తనతో ముందే చర్చించింది. అందుకే ఇక తనను వదిలేస్తున్నట్లు ప్రకటించినప్పుడు పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. అయితే ప్రపంచంలో ఎన్నో లీగ్ లు ఉన్నప్పటికీ వాటిలో ఐపీఎల్ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఇలాంటి లీగ్ లో నేను భాగం కావడం సంతోషంగా ఉంది. ఇక ప్రపంచంలో ఎంతోమంది ఆటగాళ్లు ఉంటారు కావలసినన్ని ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. నా వరకు అయితే నేను అన్ని ఫార్మాట్లను ఆడటానికి ఇష్టపడతాను. ఇక హైదరాబాద్ జట్టుతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది అంటూ కేన్ విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: