చరిత్ర సృష్టించిన సామ్ కర్రాన్.. ఇంగ్లాండ్ నుంచి ఒకే ఒక్కడు?

frame చరిత్ర సృష్టించిన సామ్ కర్రాన్.. ఇంగ్లాండ్ నుంచి ఒకే ఒక్కడు?

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా వరల్డ్ కప్ విజేతగా నిలిచి రెండుసార్లు టి20 వరల్డ్ కప్ సొంతం చేసుకున్న జట్టుగా రికార్డ్స్ సృష్టించింది. అయితే ఇక టి20 వరల్డ్ కప్ లో భాగంగా అటు ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలవడంలో ప్రతి మ్యాచ్ లో కూడా మంచి ప్రదర్శనతో కనబరిచిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్ కీలక పాత్ర పోషించాడు అని చెప్పాలి. టోర్నీ మొత్తం ప్రతి మ్యాచ్లో కూడా అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్లో బ్యాటింగ్ లో కూడా ఇరగదీసాడు.


 ముఖ్యంగా ఇటీవల కీలకమైన ఫైనల్ మ్యాచ్లో అయితే అటు జట్టుకు విజయాన్ని అందించడం కోసం సామ్ కర్రాన్ కనబరిచిన పోరాట ప్రతిభ అందరిని మంత్రముగ్ధులని   చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫైనల్లో ఏకంగా కీలకమైన సమయంలో మూడు వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అంతేకాదు 4 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు అని చెప్పాలి. ఇలా ఏకంగా ఫైనల్ పోరులో నాలుగు ఓవర్ల కోటాలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఇక ప్రపంచ కప్ టోర్నీలో ఆరు మ్యాచులు ఆడిన సామ్ కర్రాన్ 13 వికెట్లు పడగొట్టాడు.


 ఇక అతని అద్భుతమైన ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా సామ్ కర్రాన్ దక్కించుకున్నాడు అని చెప్పాలి. అంతేకాదు ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అతనికే వరించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును సృష్టించాడు ఈ యువ ఆల్రౌండర్. వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు సాధించిన తొలి స్పెషలిస్ట్ బౌలర్గా సామ్ కర్రాన్ నిలిచాడు. ఇప్పటివరకు ఏ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ కూడా ఇలా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకోలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: