వరల్డ్ కప్ కాదు.. ఇండియాపై గెలిపే మాకు ముఖ్యం : పాక్ క్రికెటర్

praveen
సాధారణంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఉత్కంఠ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక చిరకాల ప్రత్యర్ధులుగా ప్రపంచ క్రికెట్లో పిలవబడే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిందంటే చాలు ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎన్ని పనులున్న మానుకొని మరి మ్యాచ్ వీక్షించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక ఎప్పుడూ ఈ దయాధులు పోరు జరిగిన కూడా ఉత్కంఠ అదే రేంజిలో కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగే మ్యాచ్ అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటుంది.


 ఇకపోతే ఇక క్రికెట్ మ్యాచ్ చూసే ప్రేక్షకులలోనే ఇంత ఉత్కంఠ ఉంటే ఇక మైదానంలో బరిలోకి దిగే ఆటగాళ్లలో ఎంత ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాము భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఒక సాదాసీదా మ్యాచ్ గానే చూస్తామని ఆటగాళ్లు పైపైకి చెప్పినప్పటికీ లోలోపల మాత్రం ఇక ఆటగాళ్లలో తెలియని భావోద్వేగాలు దాగి ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంతమంది ప్లేయర్లు ఇక టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కాగా ఇటీవలే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 తమకు ప్రపంచ కప్ గెలవడం కంటే టీమిండియా పై గెలవడమే ఎంతో ముఖ్యం అంటూ షాదాబ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను.  ప్రపంచకప్ గెలిచామా లేదా అనేది మా దేశంలో ఎవరూ పెద్దగా పట్టించుకోరు.  కానీ భారత జట్టుపై విజయం సాధించామా లేదా అన్న విషయంపై మాత్రం అందరూ గమనిస్తూ ఉంటారు. అందుకే భారత్ తో మ్యాచ్ అంటే చాలు మాపై ఎంతగానో ఒత్తిడి ఉంటుంది అంటూ షాదబ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఏడాది వరల్డ్ కప్ లో సూపర్ 12 మ్యాచ్ లలో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

0ak

సంబంధిత వార్తలు: