న్యూజిలాండ్ పర్యటన.. వాళ్లకి గొప్ప అవకాశం : జహీర్ ఖాన్
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా రెగ్యులర్ కెప్టెన్ అయినా రోహిత్ శర్మకు ప్రస్తుతం సెలెక్టర్లు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో ఇక న్యూజిలాండ్ పర్యటనలో టి20 సిరీస్ ఆడబోతున్న టీమ్ ఇండియాకు హార్దిక్ పాండ్యా సారధ్య బాధ్యతలు చేపట్టబోతున్నాడు. అదే సమయంలో ఇక న్యూజిలాండ్లో టీమిండియా ఆడబోయే వన్డే సిరీస్ కు అటు శికర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.
అయితే ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు అవకాశం దక్కించుకున్నారు. కాగా ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమ్ ఇండియా మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లకు ఒక మంచి అనుభవం దక్కుతుందని ఇక న్యూజిలాండ్ పర్యటనలో యువ ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవడానికి అవకాశం ఉంది అంటూ జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ లకు గొప్ప అవకాశం అంటూ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ లో పిచ్ లు ఫేస్ బౌలింగ్కు అనుకూలంగా ఉంటాయి అంటూ తెలిపాడు జహీర్ ఖాన్. అందుకే యువ ఫాస్ట్ బౌలర్లు అందరూ కూడా తమ ఫాస్ట్ బౌలింగ్ రిధంతో ఇక మ్యాజిక్ చేసి చూపించాలని జహీర్ ఖాన్ ఒక మంచి సలహా ఇచ్చాడు.