స్టార్ ప్లేయర్ ను వదులుకున్న.. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలయ్యిందంటే చాలు అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందుతూ ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్ధులుగా  కొనసాగుతున్న వారు ఏకంగా ఐపీఎల్లో సహచరులుగా మారి పోతూ ఉంటారు. ఏకంగా ఒక జట్టుగా మారి తమ జట్టును గెలిపించుకునేందుకు హోరా  హోరీగా పోరాడు తూనే ఉంటారు అని చెప్పాలి. ఏకంగా ప్రపంచ కప్ లెవల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఉత్కంఠ భరితం గా సాగుతూ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇస్తూ ఉంటుంది.

 ఇక ఏడాది ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంబంధించి ఇప్పటినుంచి అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది బీసీసీఐ. ఈ క్రమం లోనే ఇక మినీ వేలం నిర్వహించేందుకు అంత సిద్ధం చేస్తుంది అనేది తెలుస్తుంది. అయితే ఇక అన్ని జట్ల ఫ్రాంచైజీలను  కూడా తాము వదిలేసుకునే ఆటగాళ్ల వివరాలను ఇవ్వాలని బీసీసీఐ ఇప్పటికే కోరింది అన్న విషయం తెలిసిందే. కొన్ని ఫ్రాంచైజీలు తాము వదిలేసుకోబోతున్న ఆటగాళ్ల వివరాలను ఇక అటు బిసిసిఐకి ఇచ్చేసినట్లు తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్.. కీలక ఆటగాడిని వదిలేసుకునేందుకు సిద్ధమైందట. దాదాపు 2010 నుంచి ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడుతున్న స్టార్ ప్లేయర్ కిరణ్ పొలార్డ్ ను ముంబై ఇండియన్స్ వదులుకుందట. అలాగే మిల్స్, అలెన్, మయాంక్ మార్కండే, హ్రితిక్ షాకిన్ లను జట్టు యాజమాన్యం రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం ముంబై ఇండియన్స్ మాత్రమే కాదు అటు మిగతా జట్లు కూడా తమ జట్టును మరింత పటిష్టమంతంగా మార్చుకునేందుకు ఇక కొంతమంది ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: