సెమీస్ ఓటమి ఎఫెక్ట్.. ప్రమాదంలో ఆ ఇద్దరి కెరియర్?

praveen
బాగా ఆడినప్పుడు ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక్క ఓటమితో అప్పటివరకు సాధించిన విజయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఇక ఎక్కడా లేనన్ని కారణాలను తెరమీదికి తెస్తూ విమర్శలు చేయడం చేస్తూ ఉంటారు. క్రికెట్లో ఇలాంటిది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు టీమిండియా విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతుంది. లీగ్ దశలో ఎవరికి సాధ్యం కాని రీతిలో నాలుగు మ్యాచ్లలో విజయం సాధించి ఎనిమిది పాయింట్లతో సెమీఫైనల్ లో అడుగు పెట్టింది టీం ఇండియా. కానీ ఏం జరిగిందో సెమీఫైనల్ లో ఇంగ్లాండ్కు మాత్రం కనీస పోటీ ఇవ్వలేకపోయింది.


 మొదటి బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 168 పరుగుల తో మంచి టార్గెట్ ను ఇంగ్లాండ్కు ఇచ్చినప్పటికీ బౌలింగ్ విభాగం ద్వారా ఆ టార్గెట్ ను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలం అయింది అని చెప్పాలి. తద్వారా ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఘోర పరాభవం చవిచూసింది. ఈ క్రమంలోనే అందరూ టీమిండియా పై చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఆటగాళ్ల కెరియర్ మాత్రం ప్రమాదంలో పడిపోయింది అన్న వాదన ఎక్కువగా వినిపిస్తుంది. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరో కాదు దినేష్, కార్తీక్ రవిచంద్రన్.


 ఎవరు ఊహించిన విధంగా ఐపిఎల్ లో  బాగా రాణించి ఇక టీమిండియా లో వచ్చాడు. యువ ఆటగాలను పక్కన పెట్టి తనను వరల్డ్ కప్ లోకి తీసుకునే అంతలా తన ఆటతో ప్రభావితం చేశాడు. కానీ ఎందుకు వరల్డ్ కప్ లో మాత్రం ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేక పోయాడు దినేష్ కార్తీక్. ఫినిషర్ గా అతన్ని జట్టులోకి  తీసుకుంటే అతను మాత్రం జట్టుకు భారంగా మారాడు. ఇక నాలుగేళ్ల తర్వాత టి20 జట్టులో అవకాశం దక్కించుకున్న రవిచంద్రన్ అశ్విన్ మ్యాజిక్ చేస్తాడు అనుకుంటే పరుగులు సమర్పించి టీమ్ ఇండియాకు భారంగా మారిపోయాడు. దీంతో ఇద్దరు సీనియర్ ప్లేయర్ల కెరియర్ ఇప్పుడు ప్రమాదంలో పడిపోయిందని రానున్న రోజుల్లో జట్టులో స్థానం దక్కించుకోవడం కష్టమే అన్న వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మరి బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: