సెమీఫైనల్ 2: జాస్ బట్లర్ పై భువనేశ్వర్ రికార్డ్ అదుర్స్... ఎన్నిసార్లు అవుట్ చేశాడంటే ?
ఒకవేళ పంత్ కనుక జట్టులోకి వస్తే కార్తీక్ ను తప్పిస్తారు.. లేదా ఇద్దరినీ తీసుకుంటే మాత్రం అక్షర్ పటేల్ ను తప్పించే ఛాన్సెస్ ఉన్నాయన్నది క్రికెట్ ప్రముఖుల అంచనా. కాగా ఈ మ్యాచ్ లో ఇండియాకు గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య మొత్తం 22 టీ 20 అంతర్జాతీయ మ్యాచ్ లు జరుగగా, అందులో ఇండియా 12 మ్యాచ్ లలో విజయం సాధించగా , ఇంగ్లాండ్ కేవలం 10 మ్యాచ్ లలో మాత్రమే గెలుపొందింది. ఇక వరల్డ్ కప్ లలో కూడా మనమే ఒకడుగు ముందున్నాము.. మూడు సార్లు తలపడగా రెండు సార్లు ఇంగ్లాండ్ ను చిత్తు చేశాము.
ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ కెప్టెన్ మరియు ఓపెనింగ్ బ్యాట్స్మన్ జాస్ బట్లర్ ఎంత డేంజరస్ ఆటగాడు అన్నది ప్రత్యేకించి చేప్పే అవసరం లేదు. అలాంటి బ్యాట్సమన్ పైన ఇండియా స్పీడ్ బౌలర్ భునేశ్వర్ కుమార్ కు అద్భుతమైన రికార్డ్ ఉంది. వీరిద్దరూ తలపడిన గత 30 బంతులలో 5 సార్లు అవుట్ చేశాడు. టీ 20 లలో ఒక బౌలర్ కు బ్యాట్స్మన్ పై ఇంత మంచి రికార్డ్ ఉండడం మనకు లభించే అంశం అని చెప్పాలి. ఈ మ్యాచ్ లోనూ భువి బట్లర్ ను త్వరగా అవుట్ చేస్తే సగం మ్యాచ్ గెలిచినట్లే. మరి చూద్దాం ఏమి జరుగుతుందో ?