
నిజంగా సూర్య తోపే.. 20వ ఓవర్లో.. ఎన్ని సిక్సర్లు కొట్టాడంటే?
క్రీజులోకి వచ్చి కుదురుకోవడం కాదు ఇక రావడం రావడమే చెలరేగిపోతూ సిక్సర్లు ఫోర్లతో వీరవిహారం చేస్తూ ఉంటారు బ్యాట్స్మెన్లు. అయితే మ్యాచ్ మొత్తంలో ఎంతలా పరుగులు చేసినప్పటికీ అటు చివరి ఓవర్లో పరుగులు చేయడం మాత్రం ఎంతో కీలకం.. ఎందుకంటే అటు బౌలర్లు అత్యుత్తమమైన బంతులను విసిరేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి బంతులను ఎదుర్కొని బౌండరీలు కొట్టడం అంటే బ్యాట్స్మెన్ లపై ఎంత ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చివరి ఓవర్ లో సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయేవారిని ఫినిషర్ అంటూ ఒక గొప్ప ట్యాగ్ ఇచ్చి ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.
అయితే మిగతా ఓవర్లలో సిక్సర్లు కొట్టడం అంత ఈజీ ఏమో కానీ 20వ ఓవర్లో సిక్సర్లు కొట్టడం మాత్రం చాలా కష్టమైన పని.. అలాంటిది ఇటీవలే 20 ఓవర్ లో ఎక్కువ సిక్సర్లు కొట్టి ఏకంగా ధోని సాధించిన రికార్డు లిస్టు లోకి వచ్చాడు సూర్య కుమార్ యాదవ్. అంతర్జాతీయ టీ20 లలో 2వ ఓవర్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లలో మూడవ స్థానాన్ని సంపాదించాడు హార్థిక్ పాండ్యా 61 బంతుల్లో 12 సిక్సర్లు, ధోని 132 బంతుల్లో 12 సిక్సర్లు కొట్టి ఈ లిస్టులో ఉండగా సూర్యకుమార్ మాత్రం 18 బంతుల్లోనే 10 సిక్సర్లు కొట్టి ఇక ఈ లిస్టులో కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా సూర్య కుమార్ యాదవ్ ఎంతలా చెలరేగిపోతూ అద్భుత ఇన్నింగ్స్ ఆడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.