ముందు పాకిస్తాన్ ను చూసుకో.. ఆస్ట్రేలియా గురించి ఇప్పుడేందుకు?
కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగు పెట్టకుండా ఇంటి దారి పట్టిన ఆస్ట్రేలియాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతో మంది మాజీ ఆటకాల్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకి మెంటార్గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రపంచ కప్ కు ఆస్ట్రేలియా పూర్తిస్థాయిలో సన్నతమైనట్లు కనిపించలేదు అంటూ చెప్పుకొచ్చాడు.
జరుగుతుంది ఒక ప్రీమియం ఈవెంట్.. ఇక ఈవెంట్ అంటే ఎలా ఉండాలి అన్ని శక్తులు సిద్ధం చేసుకొని బరువులోకి దిగాలి. కానీ దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియా ఎలాంటి ప్లానింగ్ లేకుండానే వరల్డ్ కప్ లో బరిలోకి దిగింది. డిపెండింగ్ ఛాంపియన్ హోదా దశలో అడుగుపెట్టి చివరికి లీగ్ మ్యాచ్ లతోనే నిష్క్రమించడం బాధ కలిగించింది. గత నాలుగైదేళ్లుగా ఆస్ట్రేలియా క్రికెట్ ను గమనిస్తే కొన్ని విభాగాల్లో మార్పు ఎంతైనా అవసరం అని అనిపిస్తుంది. ఆస్ట్రేలియా బౌలింగ్లో మునుపటి పేస్ ను చూడలేకపోతున్నాం. ఇక బ్యాటింగ్లో స్టార్ ఆటగాళ్లు కూడా చేతులెత్తేస్తున్నారు అంటూ మాథ్యూ హెడెన్ వ్యాఖ్యానించాడు. అయితే దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళకముందు సలహాలు ఇస్తే బాగుంటుంది. కానీ వెళ్ళాక ఇప్పుడు బాధపడడం ఏంటి. ముందు నువ్వు మెంటర్ గా ఉన్న పాకిస్తాన్ గురించి చూసుకో అంటూ రిప్లై ఇస్తున్నారు నేటిజన్స్.