సెమీఫైనల్ : వర్షంతో మ్యాచ్ రద్దయితే.. విజేతను ఎలా నిర్ణయిస్తారంటే?
ఈ క్రమంలోనే ఒకవేళ కీలకమైన సెమీఫైనల్ లో కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి అని అనుమానం ప్రతి ఒక్కరిలో కలిగే ఉంటుంది. సెమీఫైనల్స్ కోసం ప్రత్యేకమైన రిజర్వు డేలు ఉన్నాయి అని చెప్పాలి. దీంతో మ్యాచ్ రోజు వర్షంతో ఆట సాధ్యం కాకపోతే ఇక రిజర్వు డే రోజున మ్యాచ్ ను పూర్తి చేస్తారు. మ్యాచ్ ను కొత్తగా ప్రారంభించకుండా మ్యాచ్ ఎక్కడ అయితే నిలిచిపోయిందో అక్కడి నుంచే రిజర్వు డే రోజు ఆట మొదలవుతుంది అని చెప్పాలి. అయితే ఇక ముందుగా ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం అయితే ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ చేసిన రోజు మ్యాచ్ పూర్తయ్యేలా అంపైర్లు చూస్తారు. కుదరకపోతే మ్యాచ్‌ని వాయిదా వేస్తారు.
అయితే మ్యాచ్ జరిగిన రోజు మాత్రమే కాదు రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడితే అప్పుడు పరిస్థితి ఏంటి అని అనుమానం అందరిలో వచ్చే ఉంటుంది.ఒకవేళ షెడ్యూల్, రిజర్వ్ డే రెండు రోజుల్లోనూ వర్షం పడితే.. అలాంటి సందర్భంలో కనీసం 5 ఓవర్ల చొప్పున ఆటను కొనసాగించేందుకు అంపైర్లు ప్రయత్నిస్తారు . అది కూడా కుదరకపోతే గ్రూప్స్ లో టాపర్స్ గా నిలిచిన జట్లు ఫైనల్స్ కు చేరతాయి. కివీస్ వర్సెస్ పాక్ సెమీస్ మ్యాచ్ వర్షంతో రిజర్వ్ డే రోజు కూడా జరగకపోతే అప్పుడు కివీస్ ను విజేతగా నిర్ణయిస్తారు. ఇకపోతే గ్రూప్ వన్ నుంచి న్యూజిలాండ్ జట్టు టాపర్‌గా కొనసాగుతూ ఉండగా.. గ్రూప్ 2 నుంచి 8 పాయింట్లతో ఇండియా జట్టు టాపర్‌గా కొనసాగుతూ ఉంది.