దొందు దొందే.. టీమ్ ఇండియాకు ఏం దొరికారు సామీ?
సెమీఫైనల్ లో భాగంగా ఈనెల 10వ తేదీన గురువారం రోజు ఇంగ్లాండుతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ ఆసక్తికర పోరును వీక్షించేందుకు అటు మరోసారి క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. ఇక అంతకు ముందు రోజే అంటే నవంబర్ 9వ తేదీన కివీస్ జట్టుతో తలబడేందుకు సిద్ధమవుతుంది దాయాది పాకిస్తాన్. అయితే ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో ఎంతగానో పటిష్టంగా కనిపిస్తుంది. వరస విజయాల సాధిస్తుంది.కానీ టీమిండియాని మాత్రం కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్ల వైఫల్యం టీమిండియాను కలవరపెడుతోంది.
ఆ ముగ్గురు ఎవరో కాదు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషబ్ పంత్, వెటరన్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్.. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఓపెనర్ గా మొత్తానికే చేతులెత్తేస్తున్నాడు. ఒక్క మ్యాచ్ లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇక దినేష్ కార్తీక్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నాడు. ఇక ఇటీవల తుది జట్టులో ఛాన్స్ దక్కించుకున్న పంత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక సింగిల్ డిజిట్ స్కోర్కె పెవిలియన్ చేరాడు. ఇక ఈ ముగ్గురు పేలవమైన ఫామ్ అటు టీమ్ ఇండియాను కలవరపెడుతుంది అని చెప్పాలి.