ధోని చెప్పిన ఆ మాట.. నా గుండెను తాకింది : కోహ్లీ

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరో మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని మధ్య ఉండే స్నేహబంధం గురించి క్రికెట్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోని టీమిండియా జట్టుకు సారథిగా ఉన్న సమయంలోనే భారత జట్టులోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ ధోని సలహాలతోనే ఒక గొప్ప క్రికెటర్ గా ఎదిగాడు అని చెప్పాలి.  ఇక కెరియర్ తొలినాళ్లలో విరాట్ కోహ్లీ బాగా రాణించలేక జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి వచ్చిన సమయంలో కూడా విరాట్ కోహ్లీకి అండగా నిలిచిన మహేంద్ర సింగ్ ధోని అతని జట్టులో కొనసాగించి వరుస అవకాశాలు ఇచ్చాడు.. ఇలా కోహ్లీ కెరియర్లో మంచి ఆటగాడిగా మారడానికి ధోని కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ధోనీతో తనకు ఉన్న అనుబంధం గురించి విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా చెబుతూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. మహేంద్ర సింగ్ ధోని తనకు కేవలం ఒక స్నేహితుడు మాత్రమే కాదు ఏకంగా సొంత అన్నలాంటి వాడు అంటూ విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నోసార్లు తెలిపాడు. మొన్నటికి మొన్న ఫామ్ కోల్పోయిన సమయంలో అందరూ తనపై విమర్శలు చేస్తుంటే ధోని మాత్రం తనకు అండగా నిలబడుతూ మెసేజ్ చేసాడు అంటూ గుర్తు చేసుకున్నాడు. ఇక ఇటీవల తనతో ధోని చెప్పిన మాటల గురించి గురించి తెలిపాడు విరాట్ కోహ్లీ.


 అంతేకాదు ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై రన్ మిషన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. తన జీవితంలో మహేంద్రసింగ్ ధోనితో స్నేహం ఏర్పడటం ఒక వరం లాంటిది అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. నువ్వు బాగా ఆడుతున్నప్పుడు జనం నిన్ను పట్టించుకోరు. బలంగా ఉండాలని మనసులో నువ్వు అనుకుంటే.. నిజంగానే బలంగా ఉంటావు అంటూ మహేంద్రసింగ్ ధోని చేసిన మెసేజ్ తన మనసును బలంగా తాకిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. తనలో ఎంతగానో ఒత్తిడిని తగ్గించింది అంటూ తెలిపాడు. ఇక కోహ్లీ వ్యాఖ్యలతో  ధోని, కోహ్లీ బాండింగ్ ఎంతో ప్రత్యేకము అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: