టీమ్ ఇండియా తో మ్యాచ్.. జింబాబ్వే కెప్టెన్ ఏమన్నాడో తెలుసా?
అదే సమయంలో సొంత గడ్డపై వరల్డ్ కప్ జరిగినప్పటికీ అటు ఆస్ట్రేలియా మాత్రం నిరాశపరిచింది అని చెప్పాలి. ఇకపోతే ఇక ఇప్పుడు గ్రూప్ 2 లో అటు సెమీఫైనల్ లో అడుగుపెట్టబోయే జట్లు ఏవి అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో భారత్ స్టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. అయితే నవంబర్ 9వ తేదీన పసికూన జింబాబ్వే తో మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఇక అందరికంటే ఎక్కువ పాయిలతో టాప్ లో కొనసాగి సెమీఫైనల్ అడుగు పెట్టిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టిస్తుంది.
అయితే టీమిండియాతో మ్యాచ్ కూ ముందు అటు జింబాబ్వే కెప్టెన్ ఇర్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ పై విజయం సాధించడంతో తమ ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరిగింది అంటూ ఇర్విన్ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ పై విజయం తర్వాత ఈ టోర్నమెంట్ లో ఏ జట్టునైనా సరే ఓడించగలుగుతామాని ధీమా వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ మంచి ఆటగాడని అతడిని అవుట్ చేసేందుకు తమ వద్ద ఎలాంటి ప్లాన్స్ లేవు అంటూ తెలిపాడు.